Intinti Ramayanam Today Episode june 18th: సుబ్బారావు అలాగే నిర్మల తమల్ని ఎవరో కిడ్నాప్ చేశారని బాధపడిపోతూ ఉంటారు.. అయితే పల్లవి అక్కడున్న రౌడీ లకి ఫోన్ చేసి ఏం జరిగిందో అని తెలుసుకుంటారు. సుబ్బారావు నిర్మల అక్కడే ఉన్నారు కదా వాళ్ళని ఎట్టి పరిస్థితులను బయటికి తీసుకురావద్దు అని పల్లవి వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది. అయితే పల్లవి నిజంగానే వాళ్ళని కిడ్నాప్ చేసి ఉండడంతో ఆ విషయం తెలియక సుబ్బారావు నిర్మల ఎవరో కిడ్నాప్ చేశారని భయపడిపోతూ ఉంటారు.. అవనీ వాళ్ళ తల్లిని జీవితాంతం జైల్లోనే ఉంచాలి అంటే సుబ్బారావు వాళ్ళు బయటపడకుండా ఉండాలి అని రౌడీలకు చెప్తుంది..
ఏంటమ్మా అవని ఇప్పుడు మీ అమ్మకి ఎలా ఉంది అని పార్వతి అడుగుతుంది. ఇప్పుడు పర్వాలేదు అత్తయ్య ఆపరేషన్ పూర్తయింది కదా ఇప్పుడు బాగానే ఉంది అని అవని అంటుంది. ఈ వయసులో తనకి ఎన్ని కష్టాలు అని పార్వతి బాధ పడుతూ ఉంటుంది. నేను ఒకసారి మీనాక్షి ని చూడాలి రా అక్షయ్ నన్ను హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళవా అని పార్వతి అంటుంది. మీరు వెళ్లాలనుకున్న కూడా చూడలేదు అత్తయ్య అని పల్లవి అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది అవని.. అదే అత్తయ్య ఆమె ఇప్పుడు రిమాండ్ లో ఉన్న ఖైదీ కాబట్టి పోలీసులు ఆమెని మళ్లీ జైలుకు తీసుకొని వెళ్ళి ఉంటారు అని పల్లవి అంటుంది. అవునమ్మా మీనాక్షి అత్తయ్యకు బాగా అవగానే పోలీసులు ఆమెను మళ్లీ స్టేషన్ కి తీసుకుని వెళ్లారు అని అక్షయ్ అంటాడు. మా అమ్మ జైలు పాలు అవ్వడానికి కారణమైన నిన్ను అస్సలు వదిలిపెట్టను అని అవని మనసులో అనుకుంటుంది.. అటు పల్లవి కూడా మా అమ్మ చనిపోవడానికి కారణమైన నిన్ను అసలు వదలను అని అంటుంది..
కమల్ సుబ్బారావు ఎక్కడున్నాడు వెతుకుతూ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అయితే అక్కడ సుబ్బారావు కనిపించకపోవడంతో కమల్ ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. కమల్ సుబ్బారావు ఇక ఎక్కడ కనిపించలేదు అని వెళ్తూ ఉండగా అక్కడ సరోజ కనిపించడంతో తన దగ్గరికి వెళ్తాడు. సరోజ నాకు సుబ్బారావు ఎక్కడున్నాడో తెలియదు బాబు అని ఎంత చెప్తున్నా సరే కమల్ మాత్రం అతను ఫోన్ చేస్తే అడ్రస్ కనుక్కొని నాకు ఫోన్ చెయ్యు అని నెంబర్ ఇస్తాడు. సరోజ చెయ్యి పట్టుకుని నెంబర్ ఇవ్వడం చూసినా పల్లవి భానుమతి ఇద్దరు కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు. పెళ్ళాం సరిగ్గా లేకపోతే ఇలాంటి బాధలే వస్తాయి అని కమల్ పై అనుమానం మొదలవుతుంది.
అందరూ భోజనం చేస్తూ ఉండగా.. కమల్ లోపలికి వస్తాడు. వదిన ఆ సుబ్బారావు దొరకలేదు కానీ అతని జాడ వెతికే పనిలోనే ఉన్నాను. అతను ఎక్కడ ఉంటాడో తెలిసింది అని కావాలని అబద్ధం చెప్తాడు. నువ్వు చెప్పేది నిజమా కన్నయ్య మరి ఆ సుబ్బారావు ఎక్కడున్నాడో వెతికి పట్టుకుందాము అని అవని అంటుంది. అయితే కమల్ ఆ సుబ్బారావు ఎక్కడున్నాడో ఎలా తెలిసింది అని పల్లవి షాక్ అవుతుంది. నిజంగానే కమల్ కి సుబ్బారావు ఎక్కడున్నాడో తెలిసిపోయిందా అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది.
నిర్మలకు పల్లవి ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారు మిమ్మల్ని ఎవరు చూడలేదు కదా.. మీరు నిజంగానే ఇలా దాక్కుని ఉన్నారా అని అవని అడుగుతుంది. మీరు డబ్బులు ఇచ్చారు కదా మేము మీకు చెప్పినట్లుగానే ఎవరికీ కనిపించకుండా దూరంగా దాక్కొని ఉన్నాము అని నిర్మల అంటుంది. రెండు మూడు రోజులు మీరు ఇలానే ఉండాలి అని పల్లవి చెప్పగానే.. మీరు డబ్బులు ఇచ్చారు కదా.. మీరు ఎలా చెప్తే నేను అలానే వింటాను అని నిర్మల అనడం చూసి సుబ్బారావు ప్రతిసారి డబ్బులు ఇచ్చాను డబ్బులు ఇచ్చాను అని అనడం ఎందుకే.. డబ్బులు ఇచ్చారు కదా అనేసి ఇక్కడే ఉండిపోతామా అని సుబ్బారావు అంటాడు. ఒకవేళ డబ్బులు ఇస్తే నన్ను కూడా చంపేస్తావా అని సుబ్బారావు అనగానే డబ్బులు ఇచ్చేదాన్ని బట్టి ఆలోచిస్తాను అని అంటుంది.
సరోజాకి ఫోన్ చేసిన సుబ్బారావు ఎక్కడున్నాడు అన్న విషయాన్ని బయట పెడుతుంది. అతను నిజంగానే ఎక్కడున్నాడో తెలుసుకోవాలని సరోజ కమల్ చెప్పిన విధంగా మాట్లాడుతుంది. దాంతో సుబ్బారావు నీకు చెప్పకుండా ఎవరికి చెప్తాను బంగారం అని అసలు విషయాన్ని బయట పెడతాడు. ఇక వెంటనే సరోజా ఆ విషయాన్ని కమల్ కి ఫోన్ చేసి చెప్తుంది.. మీరు అడిగినట్లుగానే నేను ఆ సుబ్బారావు ఎక్కడున్నాడో తెలుసుకుని చెప్పాను మీరు ఆ వీడియోని ఎవరికి పంపించదు అని అడుగుతుంది.. కమల్ ఈ విషయాన్ని వెంటనే వదినకు చెప్పాలి అని చెప్తాడు.
అవని ఇక్కడ సుబ్బారావు ఉన్నాడని మనకు కన్ఫామ్ గా తెలియదు కదా ఎలా తెలుసు కమల్ అని అడుగుతుంది.. నిజంగానే ఇక్కడ సుబ్బారావు ఉన్నాడా లేదో నేను కన్ఫామ్ చేసుకొని వస్తాను వదినా అని బలవంతంగా లోపలికి వెళ్ళిన కమల్ అక్కడ సుబ్బారావు ఉన్నాడని తెలుసుకొని బయటికి వస్తాడు.. పల్లవిని సుబ్బారావుని ఇక్కడ దాచింది అని అవని అనుమాన పడుతుంది. మొత్తానికి సుబ్బారావుని బయటికి తీసుకొచ్చేందుకు అవని అలాగే కమల్ ఇద్దరు కూడా మాస్టర్ ప్లాన్ చేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…