Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ సీజన్ 9లో ప్రతి ఇద్దరు కంటెస్టెంట్స్ కు మధ్య ఓ గొడవ ఉంది. చిన్న చిన్న విషయాలకే ఓపిక లేకుండా కొంతమంది, నోరు జారి కొంతమంది, కావాలనే కుళ్ళుతో రగిలిపోయి గొడవలు పెట్టుకున్నారు మరికొందరు. ఈ లిస్ట్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దివ్య, తనూజా రైల్వల్రి గురించే. ఇన్నాళ్ళూ టైం కోసం వేచి చూసిన తనూజా ఎట్టకేలకు దివ్యను చేతికి మట్టి అంటకుండానే కోలుకోలేని దెబ్బ కొట్టింది.
వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజు నుంచే తనుజాను టార్గెట్ చేసింది దివ్య. అప్పుడు మొదలైన గొడవలు ఇప్పుడిప్పుడే తగ్గాయి అనుకునేలోపే మరోసారి తనూజా సైలెంట్ గా పని కానిచ్చింది. గతవారం వీరిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో నాగార్జున ఇద్దరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. డిఫెండ్ చేసుకోవడం మంచిదే. కానీ హద్దులు దాటి ప్రవర్తించడం కరెక్ట్ కాదని క్లాస్ పీకారు. నెక్స్ట్ డే నామినేషన్ లో దివ్య, తనూజా ఒకరినొకరు నామినేట్ చేసుకుని, ఇక్కడితో ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెడదాం, మూడవ వ్యక్తి గురించి మనల్ని ఇంకొకరు పాయింట్ అవుట్ చేయొద్దు అని కౌగిలించుకుని మరీ ఫుల్ స్టాప్ పెట్టారు. కానీ అది ఫుల్ స్టాప్ కాదు కామా అనే విషయం నేటి ఎపిసోడ్ తో బయట పడింది. సోమవారం నామినేషన్ లో నువ్వంటే ఇష్టం దివ్య అని చెప్పిన తనూజా… అన్నింటినీ మనసులో పెట్టుకుని టైమ్ కోసం వెయిట్ చేసింది. తాజాగా ఆ టైమ్ రావడంతో అదను చూసి దెబ్బకొట్టింది.
ప్రస్తుతం హౌస్ లో ఫైనల్ కెప్టెన్సికి పోటీ నడుస్తుండగా… బిగ్ బాస్ రేసులో లేని కంటెస్టెంట్స్ డ్యాగర్ కోసం పోటీ పడి తీసుకోవాలని, దాన్ని తాము కెప్టెన్ గా చూడాలనుకున్న వారికి ఇవ్వాలి అని చెప్పారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే డ్యాగర్ ను అందుకున్న కంటెండర్… రేసులో ఉండకూడదు అనుకున్న మరో కంటెండర్ దాన్ని గుచ్చి అవుట్ చేస్తారు. ఈ ప్రాసెస్ లో తనూజా డ్యాగర్ ను అందుకోవడం, రీతూకి ఇవ్వడం, ఆమె దివ్యను తీసేయడం, ఈ గ్యాప్ లో దివ్య వర్సెస్ రీతూ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే డ్యాగర్ ను దివ్యను తీయాలనే ఉద్దేశంతోనే రీతూకి ఇవ్వడానికి తనూజా ప్లాన్ చేసింది. కానీ ఆ మాట చెప్పకుండా “నువ్వు కెప్టెన్సీ రేసులో ఉండాలి” అని చెప్పింది తనూజా. అయితే తనూజా అసలు ప్లాన్ ను సంజన లీక్ చేసింది. “నువ్వు దివ్యని తీయాలని చెప్పి రీతూకి ఇస్తాను అని ఇప్పుడే అన్నావ్ కదా. ఇప్పుడు సేఫ్ ఎందుకు మాట్లాడుతున్నావ్ ?” అంటూ తనూజా బండారాన్ని బయట పెట్టింది. అయితే వెంటనే నా ఫేవరెట్ నా ఇష్టం అంటూ తనూజ సంజన నోరు మూయించింది అనుకోండి, అది వేరే విషయం. ఇలా ఇప్పటిదాకా తనను, తనతో పాటు రీతూని ఏదో ఒక విధంగా టార్గెట్ చేసి, టార్చర్ చేసిన దివ్యకు క్లోజ్ ఫ్రెండ్స్ తనూజా, రీతూ కలిసి తమ మాస్టర్ ప్లాన్ తో చివరి కెప్టెన్సీ అందకుండా చేసి రివేంజ్ తీర్చుకున్నారు.
Read Also : దొంగతనం చేసి అడ్డంగా బుక్కైన తనూజా, రీతూ… బిగ్ బాస్ తోనే ఆటలా?