E-Paper
Advertisement

Trump Warning: భగ్గుమన్న ట్రంప్.. ఖతార్ జోలికి మళ్లీ వస్తే, ఇరాన్‌లో గ్యాస్ క్షేత్రాన్ని ధ్వంసం చేస్తాం

Trump Warning: భగ్గుమన్న ట్రంప్.. ఖతార్ జోలికి మళ్లీ వస్తే, ఇరాన్‌లో గ్యాస్ క్షేత్రాన్ని ధ్వంసం చేస్తాం
Advertisement

Trump Warning: అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కీలక నేతలు హతమైనా వారి దూకుడు చూసి అగ్రరాజ్యం షాకవుతోంది. యుద్ధం ముగిసిందని భావిస్తున్న తరుణంలో ఖతార్‌పై గతరాత్రి మిస్సైళ్ల వర్షం కురిపించింది ఇరాన్. ఖరాత్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రస్‌ లాఫాన్‌ నగరంపై విరుకుపడింది. ఈ విషయం తెలియగానే అమెరికా అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. అంతేకాదు ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.

ఇరాన్‌కు మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

Advertisement

ఖతార్‌ ఎల్‌పీజీ గ్యాస్‌ క్షేత్రంపై ఇరాన్ దాడుల విషయంలో తెలియగానే ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఖతార్‌పై ఇరాన్‌ దాడిని తెలివి తక్కువగా వర్ణించారు. ఇదే కొనసాగితే ఇరాన్‌పై మునుపెన్నడూ లేనంత విధంగా దాడి చేస్తామని హెచ్చరించారు. ఖతార్‌ ఎల్‌ఎన్‌జీ క్షేత్రంపై మరోసారి దాడి చేస్తే ఏమాత్రం సహించేది లేదన్నారు. ఇరాన్‌ దక్షిణ ప్రాంతంలోని పార్స్ గ్యాస్ క్షేత్రాన్ని విధ్వంసం చేస్తామన్నారు.

ఆ స్థాయి హింస, వినాశనాన్ని తాము కోరుకోవడం లేదన్నారు. ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేసినట్టు ఇరాన్ చెబుతోంది. ఇజ్రాయెల్ ఆపరేషన్ గురించి తనకు తెలియదని, ఆ ప్రదేశంపై దాడులు చేయబోమని ఇజ్రాయెల్ హామీ ఇచ్చిందన్నారు ట్రంప్. సౌత్ పార్స్‌పై జరిగిన దాడి తర్వాత ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ మండిపడ్డారు.

Advertisement

ఖతార్‌పై మళ్లీ దాడి చేస్తే, ఇరాన్ గ్యాస్ ఫీల్డ్‌ను ధ్వంసం చేస్తాం-అమెరికా

ఇరాన్ కీలక నేత అలీ లారీజానీ దాడుల్లో మృతి చెందడంపై ఆదేశ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ స్పందించారు. ఈ దుశ్చర్యకు ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. లారీజానీని అమరవీరుడిగా వర్ణించారు ఖమేనీ. ఆయన రక్తం వృథా కానివ్వమని తేల్చిచెప్పారు. ఇరాన్ నాయకులను లక్ష్యంగా చేసుకోవడం వల్ల ఇజ్రాయెల్ తన పతనానికి తాను పునాది వేసుకుంటోందని చెప్పకనే చెప్పారు. ఇలాంటి హత్యలతో మా పోరాటం మరింత ఉద్ధృతమవుతుందన్నారు.

ఈ దాడిని ఖండించిన ఆయన, ప్రపంచం మొత్తాన్ని అదుపు చేయలేని పరిణామాలు సంభవిస్తాయని అన్నారు. ఇటు ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై ఇజ్రాయెల్ – అమెరికా మరిన్ని దాడులు చేస్తే పొరుగున ఉన్న గల్ఫ్ దేశాల చమురు, గ్యాస్ పరిశ్రమలు పూర్తిగా నాశనమవుతాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించింది .

ALSO READ: ఇరాన్ దూకుడు.. ఖతార్‌ గ్యాస్, చమురు క్షేత్రాలపై దాడులు, భారీగా నష్టం?

ఇదిలావుండగా పొరుగు దేశాలపై ఇరాన్‌ చేస్తున్న దాడులను తక్షణం నిలిపివేయాలని అరబ్‌-ఇస్లామిక్‌ దేశాలు పిలుపు నిచ్చాయి. అంతర్జాతీయ చట్టాలను టెహ్రాన్‌ గౌరవించాలని సూచించాయి. సౌదీ రాజధాని రియాద్‌లో ఆయా దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

ఇరాన్‌ నివాస ప్రాంతాలు, పౌర వసతులు, చమురు క్షేత్రాలు, నీటి శుద్ధి ప్లాంట్లు ఎయిర్‌ పోర్టులను లక్ష్యంగా చేసుకొంటోందని ఆరోపించాయి జోర్డాన్‌, అజర్‌బైజన్‌, టర్కీ దేశాలు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. దీంతో పసిఫిక్ దేశాల్లో ఇంధన కొరత ఏర్పడుతుందని ఆయా దేశాలు భయపడుతున్నాయి. అక్కడ సమోవా, టోంగా వంటి దేశాలు దిగుమతి చేసుకున్న పెట్రోలియంపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. సమోవా దేశ విద్యుత్ ఉత్పత్తిలో సుమారు మూడొంతులకుగాను రెండొంతులు దిగుమతి చేసుకున్న డీజిల్ నుంచి వస్తుంది.

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×