E-Paper
Advertisement

ఇక మీదట అంత మంచి వాడిగా ఉండను.. ఇరాన్ కు ట్రంప్‌ వార్నింగ్‌

ఇక మీదట అంత మంచి వాడిగా ఉండను.. ఇరాన్ కు ట్రంప్‌ వార్నింగ్‌
Advertisement

Trump machine gun photo viral: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో మరోసారి ఇరాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ తన గందరగోళ పరిస్థితి నుంచి బయటపడలేకపోతోందని.. అణ్వాయుధ రహిత ఒప్పందంపై సంతకం చేయడం ఆ దేశానికి చేతకావడం లేదని ట్రంప్ మండిపడ్డారు. ఇప్పటికైనా తెలివిగా వ్యవహరించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ట్రంప్ తన పోస్ట్‌తో పాటు చేతిలో మిషన్ గన్ పట్టుకున్న ఫోటోను జత చేస్తూ నో మోర్ మిస్టర్ నైస్ గాయ్(No More Mr. Nice Guy) అని పేర్కొన్నారు.

పశ్చిమాసియాలో అత్యంత కీలకమైన ఇరాన్ దేశం ప్రస్తుతం కుప్పకూలే స్థితిలో ఉందని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంలో నాయకత్వ సంక్షోభం నెలకొందని.. పరిస్థితులను చక్కదిద్దుకునే వరకు అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ని తెరిచి ఉంచాలని ఇరాన్ తమను కోరినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ తన అంతర్గత సమస్యలను పరిష్కరించుకోగలదని తాను నమ్ముతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

మరోవైపు జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ లక్ష్యంగా ట్రంప్ పదునైన విమర్శలు గుప్పించారు. ఇరాన్ వద్ద అణు ఆయుధాలు ఉండవచ్చని మెర్జ్ భావిస్తున్నారని.. ఆయనకు అసలు విషయం తెలియదని ట్రంప్ ఎద్దేవా చేశారు. ఒకవేళ ఇరాన్ గనుక అణు సామర్థ్యాన్ని సాధిస్తే ప్రపంచం మొత్తం ఆ దేశం చేతిలో బందీగా మారుతుందని హెచ్చరించారు. గతంలోని అధ్యక్షులు లేదా ఇతర దేశాలు చేయలేకపోయిన పనిని తాను ఇప్పుడు ఇరాన్ విషయంలో చేస్తున్నానని ఆయన గర్వంగా ప్రకటించారు. జర్మనీ ఆర్థికంగా ఇతర రంగాల్లో వెనుకబడటానికి ఇటువంటి నాయకత్వమే కారణమని విమర్శించారు.

ఈ పరిణామాలు అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హార్ముజ్ జలసంధి మూసివేత లేదా తెరిచి ఉంచడం వంటి అంశాలు ప్రపంచ ఇంధన భద్రతతో ముడిపడి ఉన్నాయి. అమెరికా వైఖరి వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Advertisement

Read Also: కరాచీలో గ్యాస్ బెలూన్లు.. ఎల్పీజీ కొరతతో ప్రమాదకరంగా స్టోరేజీ

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×