E-Paper
Advertisement

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ప్రపంచవ్యాప్తంగా చర్చ, యూఎన్ చర్యలు తీసుకోవాలని ఇరాన్ డిమాండ్

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ప్రపంచవ్యాప్తంగా చర్చ, యూఎన్ చర్యలు తీసుకోవాలని ఇరాన్ డిమాండ్
Advertisement

Trump Pirates Remark: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము సముద్రపు దొంగలమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. దీనిపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రంప్ పై చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిని డిమాండ్ చేసింది. ఇంతకీ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏ సందర్భం గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ప్రపంచవ్యాప్తంగా చర్చ

Advertisement

ఇరాన్-అమెరికా మధ్య చర్చల మాట ఏమోగానీ మాటల యుద్ధం తీవ్రమవుతోంది. దాదాపుగా యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నప్పటికీ హోర్మూజ్ జలసంధి వద్ద పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి. మార్కెట్లో చమురు ధరలు ఆశాకాన్ని తాకింది. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇరాన్ జెండాతో ఉన్న కార్గో షిప్‌లను అమెరికా నేవీ విభాగం స్వాధీనం చేసుకుంది.

దీనిపై తీవ్రంగా రియాక్ట్ అయ్యింది ఇరాన్. అమెరికా చర్యను అంతర్జాతీయ జలాల్లో సాయుధ దోపిడీగా వర్ణించింది. ఆదేశం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి బఘాయీ ఆరోపించారు. ఇరాన్ చేసిన వ్యాఖ్యలపై ఫ్లోరిడాలో అధ్యక్షుడు ట్రంప్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇరాన్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. తాము సముద్రపు దొంగలమేనని అన్నారు.

Advertisement

యూఎన్ చర్యలు తీసుకోవాలని ఇరాన్ డిమాండ్

కొన్ని రోజుల కిందట గల్ఫ్‌ సముద్ర జలాల్లో నౌకలను సీజ్‌ చేసిన అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. తాము నౌకలను మా ఆధీనంలోకి తీసుకున్నామని అన్నారు ట్రంప్. చమురును స్వాధీనం చేసుకున్నామని, చాలా లాభదాయకమైన వ్యాపారంగా చెప్పుకొచ్చారు. ఇరాన్‌ సైన్యానికి ఎలాంటి రాడార్‌ వ్యవస్థలు లేవని, వారి నాయకత్వం బలహీనమైందన్నారు.

మాతో వాళ్లు ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. ఇరాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము వెనక్కి తగ్గితే.. మరో మూడేళ్లలో ఈ సమస్య మళ్లీ వస్తుందన్నారు. పూర్తి పరిష్కారం దొరికే వరకు తాము వెనక్కి వెళ్లమని తేల్చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని ఇరాన్ డిమాండ్ చేసింది.

ALSO READ: ఇరాన్‌లో ఘోర విషాదం.. ఆయుధాల పేలుడుతో 14 మంది రెవల్యూషనరీ గార్డ్స్ మృతి

నేరాన్ని ట్రంప్ అంగీకరించారని, సముద్రంలో చట్టవిరుద్ధమైన ప్రవర్తనను బహిరంగంగా అంగీకరించడమేనని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి బఖాయీ అన్నారు. ఇది ముమ్మాటికీ అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘించే ప్రయత్నాలుగా వర్ణించారు.

ట్రంప్ ఇలా రోజుకో మాదిరిగా వ్యాఖ్యలు చేయడంతో హోర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించలేదు. ప్రపంచ ఇంధన మార్గమైన హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకాయానాన్ని ఇరాన్ పరిమితం చేసింది. ఇరాన్ ఓడరేవులపై తన దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తోంది.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×