Twitter Layoffs Begin : ట్విట్టర్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టారు ఎలాన్ మస్క్. వచ్చీరాగానే ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌తో సహా మరికొంత మందిని తొలగించారు. మస్క్ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కొనుగోలు జరిగే సమయంలో 75 శాతం ఉద్యోగులను తొలగించబోతున్నట్లు తెలిపారట. రానున్న రోజుల్లో మరింత మందికి పింక్ స్లిప్ ఇచ్చి ఇంటికి పంపించి వేయనున్నారు ట్విట్టర్ నూతన చైర్మన్.
ట్విట్టర్‌లో సుమారు 7,500 ఉద్యోగులు పనిచేస్తున్నారు. 75 శాతం మందిని తొలగిస్తున్నారనే టాక్ వినబడింది.. ఈ లెక్కన 5వేల మంది ఉద్యోగాలు గాల్లో వేలాడుతున్నాయ. ట్విట్టర్ నుంచి తొలగించాల్సిన ఉద్యోగుల జాబితాను నవంబర్ 1లోగా తయారు రెడీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారట ఎలాన్ మస్క్.
ఇకపై ట్విట్టర్‌లో ఫేక్ అకౌంట్లకు ఎక్కువగా స్థానం ఉండకపోవచ్చు. ట్విట్టర్‌ను ముందుగా కొనేందుకు మస్క్ వెనకబడ్డానికి కారణం కూడా ఫేక్ అకౌంట్లే. ట్విట్టర్లో పోస్ట్ అయ్యే ప్రతీ కంటెంట్‌ను సమీక్షించేందుకు ప్రత్యేకంగా ‘కంటెంట్ మోడరేషన్ కౌన్సిల్’ను ఏర్పాటు చేయనున్నారు ఎలాన్ మస్క్.