Vidadala Rajini : మరో వివాదంలో చిక్కుకున్నారు మాజీమంత్రి వ విడదల రజిని. రజిని మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తామని తమ వద్ద 5 కోట్లు తీసుకుని మోసం చేసిందని ఎస్పీకి ఫిర్యాదు వెళ్లింది . రజిని పిఎలు శ్రీకాంత్, రామకృష్ణ, ఫణి, శ్రీగణేష్‌కి డబ్బులు ఇచ్చామని బాధితులు చెబుతున్నారు. చిలకలూరిపేటకి చెందిన పలువురు వైసీపీ నేతలు ఎస్సీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో చిలకలూరిపేట మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్న కూడా ఉన్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు వాపోతున్నారు.