Road Accident: రాజస్థాన్‌లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఆదివారం రాత్రి ఆగి ఉన్న ట్రక్కును టెంపో ట్రావెలర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవకముందే మరో ప్రమాదం జరగడం అందులోను పదుల సంఖ్యలో ప్రజలు చనిపోవడంతో తీవ్ర ఆందోళన రేకిత్తిస్తోంది.
తాజాగా రాజస్థాన్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్ పరిధిలో డంపర్ ట్రక్ డ్రైవర్ మద్యం మత్తులో అదుపు తప్పి పలు వాహనాలను ఢీకొట్టాడు. ఈ నేపథ్యంలో 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 50 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Also Read: అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన వంగలపూడి అనిత
రాజస్థాన్‌లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం భజన్ల శర్మ. బాధిత కుటుంబాలకు సహాయం చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం.