E-Paper
Advertisement

UAE Floods: ఎడారి దేశాన్ని ముంచెత్తిన వరదలు.. యూఏఈలో భారీ వర్షాలకు కారణమేంటి?

UAE Floods: ఎడారి దేశాన్ని ముంచెత్తిన వరదలు.. యూఏఈలో భారీ వర్షాలకు కారణమేంటి?
Advertisement

UAE Floods: ఎడారి దేశమైన యూఏఈని వరదలు ముంచెత్తాయి. శుక్రవారం తెల్లవారుజామున దుబాయ్, అబుదాబి వంటి ప్రధాన నగరాలతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వాలని అధికారులు సూచించారు. యూఏఈలో చాలా అరుదుగా వర్షాలు కురుస్తాయి. కొన్ని రోజుల్లో తీవ్రమైన వర్షాలు పడుతుంటాయి. భారీ వర్షాలు ఆందోళనల కలిస్తున్నాయి.

దుబాయ్ లో భారీ వర్షాలు

గురువారం రాత్రి దుబాయ్‌లో భారీ వర్షాలు కురిశాయి. రాజధాని అబుదాబిలో భారీ వర్షాలకు రోడ్లు జలమయం అయ్యాయి. శుక్రవారం ఉదయం నాటికి, లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు వీడియోల్లో ఉత్తర ఎమిరేట్స్ వీధులను వరద నీరు ముంచెత్తింది. వరద ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు వాహనదారులను కోరారు.

Advertisement

ప్రభుత్వ ఉద్యోగులను ఇళ్ల నుంచే పనిచేయాలని దుబాయ్ ప్రభుత్వం ఆదేశించింది. ప్రైవేట్ కంపెనీలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అబుదాబిలో ప్రయాణం తప్పనిసరి అయితే తప్ప బయటకు రావొద్దని సూచించింది. ముందు జాగ్రత్త చర్యగా పబ్లిక్ బీచ్‌లు, పార్కులు, పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేశారు.

భారీ వర్షాలకు కారణమేంటి?

గల్ఫ్‌ దేశాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. దుబాయ్ వంటి ఎడారి నగరాల్లో అతి తక్కువ సమయంలో అతి భారీ వర్షాలు కురుస్తుంటాయి. ఆకస్మికంగా మేఘాలు కమ్ముకుని తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో వర్షం కురిసినప్పుడు డ్రైనేజీ వ్యవస్థ స్తంభించి, వరద నీరు రోడ్లపైకి చేరుతుంది. ఏడారి దేశాల్లో డ్రైనేజీ వ్యవస్థలో లోపాలను ఏప్రిల్ 2024 వరదలు బయటపెట్టాయి. శుక్రవారం కురిసిన వర్షం మరోసారి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హెచ్చరిస్తున్నాయి. భారీ వర్షాలు వాతావరణ మార్పులే కారణమని నిపుణులు అంటున్నారు.

Advertisement

Also Read: Pakistan: పాకిస్థాన్‌కు కండోమ్స్ సమస్య.. నో చెప్పిన ఐఎంఎఫ్, ఇప్పుడెలా ముందుకు?

విమానాల రాకపోకలపై ప్రభావం

వరదలతో ఇండిగోతో సహా విమానయాన సంస్థలు ప్రయాణికులకు అలర్ట్ జారీ చేశాయి. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తుండడంతో విమాన రాకపోకలు ఆలస్యం అవుతున్నాయని ఇండిగో పేర్కొంది. క్రిస్మస్ కు ఇంటికి వెళ్తున్న ప్రయాణికులతో దుబాయ్ ఎయిర్ పోర్టులో రద్దీ నెలకొంది. వర్షాల కారణంగా విమానాల రాక ఆలస్యం అవుతుంది. ఖతార్‌లోని దోహా స్టేడియం సమీపంలో భారీ వర్షం కారణంగా FIFA అరబ్ కప్ ప్లేఆఫ్ మ్యాచ్ రద్దు అయింది.

 

Related News

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

సముద్రంలో పెను విషాదం.. రోహింగ్యా శరణార్థుల పడవలు బోల్తా.. 500 మందికి పైగా మృతి!

బీచ్‌లో గుండె గుభేల్.. నడినెత్తి మీద నుంచి దూసుకెళ్లిన యుద్ధ విమానాలు.. గాల్లోకి ఎగిరిన టెంట్లు!

Big Stories

Advertisement
×