E-Paper
Advertisement

వైట్ హౌస్ విందులో కాల్పులు.. కామ్ గా సలాడ్ తింటున్న సూపర్ ఏజెంట్.. వీడియో వైరల్

వైట్ హౌస్ విందులో కాల్పులు.. కామ్ గా సలాడ్ తింటున్న సూపర్ ఏజెంట్.. వీడియో వైరల్
Advertisement

White House Firing: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా ప్రముఖ సభ్యులు హాజరైన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ లో కాల్పుల కలకలం రేగింది. శనివారం రాత్రి వాషింగ్టన్ హిల్టన్ హోటల్ బాల్‌రూమ్‌లో ఒక దుండగుడు కాల్పులు జరపడం గందరగోళం సృష్టించింది. భద్రతా బలగాలు వెంటనే స్పందించి ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లను సురక్షిత ప్రాంతానికి తరలించారు. హాజరైన సభ్యులు చాలామంది భయపడి, ఎగ్జిట్ వైపు పరుగులు తీశారు. విలేకరులు, డిన్నర్ కు హాజరైన సభ్యులు టేబుళ్ల కింద దాక్కున్నారు. అయితే క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ (CAA)కి చెందిన మైఖేల్ గ్లాంట్జ్‌ మాత్రం చాలా కూల్ గా సలాడ్‌ తింటూ కూర్చొన్నాడు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

కూల్ గా సూపర్ ఏజెంట్

ఫేమస్ టీవీ స్టార్స్, సినీ ప్రముఖుల ఇంటర్య్వూలు చేసే ‘సూపర్ ఏజెంట్’గా పేరు పొందిన గ్లాంట్జ్, తన చుట్టూ ఉన్నవారందరూ ప్రాణభయంతో బయటకు పరుగులు తీస్తున్నప్పటికీ సలాడ్ తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గ్లాంట్జ్ సీఏఏలో ఒక ప్రముఖ ఏజెంట్, సీఎన్ఎన్ యాంకర్ వోల్ఫ్ బ్లిట్జర్‌తో సహా పలువురు ప్రముఖ మీడియా టీమ్ కు ఆయన ప్రాతినిధ్యం వహిస్తారు. వోల్ఫ్ బ్లిట్జర్ కూడా ఆ ఈవీంగ్ పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపిన కాల్పుల ఘటనలో గ్లాంట్జ్ చలించకుండా సలాడ్ తింటున్న దృశ్యాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Advertisement

వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో జరిగిన కాల్పుల ఘటనపై మైఖేల్ గ్లాంట్జ్ తీరు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ, కాల్పుల సమయంలో చాలా మంది ఆందోళన చెందలేదని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు గోల్డ్‌మన్ సాక్స్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లాయిడ్ బ్లాంక్‌ఫెయిన్, సీబీఎస్ న్యూస్ జర్నలిస్టులతో కలిసి ఓ రూమ్ లో ఉన్నారు. కాల్పులు జరుగుతున్న సమయంలో.. బ్లాంక్‌ఫెయిన్ తన పక్కన కూర్చున్న వ్యక్తిని.. ఆ సలాడ్ పూర్తి చేస్తావా? అని అడిగినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.

Also Read:ఆ అనుమానాల వేళ వైట్‌హౌస్ ఆగ్రహం.. రిపబ్లికన్ల పనేనంటూ..

కాల్పుల ఘటన

Advertisement

వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ ఈవెంట్ లో తుపాకులతో ఓ వ్యక్తి చొరబడ్డాడు. ఈవెంట్ లాబీలోకి చొరబడి కాల్పులు జరపడంతో.. ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వైట్ హౌస్ ఉన్నతాధికారులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాల్పులకు తెగబడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని కాలిఫోర్నియాలోని టోర్రాన్స్‌కు చెందిన 31 ఏళ్ల కోల్ టోమాస్ అలెన్‌గా గుర్తించారు. అయితే అతడు ఎందుకు కాల్పులు జరిపాడో వివరాలు తెలియాల్సి ఉంంది. శనివారం రాత్రి జరిగిన దాడికి సంబంధించిన అభియోగాలను త్వరలో నమోదు చేస్తామని తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె మీడియాకు తెలిపారు.

Related News

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

Big Stories

Advertisement
×