Big Stories

ChatGpt :చాట్‌జీపీటీలు రావేమో.. బ్యాన్‌పై పెరుగుతున్న డిమాండ్స్

ChatGpt :ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత మేలు చేస్తుందో అంతే నష్టం తీసుకొస్తుంది. నష్టం కంటే నాశనం చేస్తుందని చెప్పడమే బెటర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ తిరుగులేని అస్త్రం. పర్ఫెక్ట్‌గా రెడీ చేస్తే దాన్ని మించింది మరోటి లేదు. మరి అలాంటిదే మరొకటి తయారు చేస్తే. ఈ ఇద్దరూ చేసే ఫైట్ అతి భయంకరంగా ఉంటుంది. పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెల్లమెల్లగా.. సొంత ఇంటెలిజెన్స్ వరకు డెవలప్ కావొచ్చు. చాట్‌జీపీటీ మనం అడిగిన వాటికే సమాధానాలు ఇవ్వాలి. కాని, అది తిడుతోంది, బెదిరిస్తోంది, ఇంకోసారి రిపీట్ చేస్తే లైఫ్ నాశనం చేస్తానని వార్నింగ్ ఇస్తోంది. ట్రయల్ వర్షన్స్‌లో ఉన్నప్పుడే ఇన్ని వేరియేషన్స్ ఉంటే.. రేప్పొద్దున మనిషిని మెషీన్ డామినేట్ చేయదన్న గ్యారెంటీ ఏముంది. ముఖ్యంగా పిల్లలకు చదువులు అక్కర్లేకుండా చేస్తుందని విద్యావేత్తలు కూడా భయపడుతున్నారు. అందుకే, చాట్‌జీపీటీని బ్యాన్ చేయాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి.

- Advertisement -

భవిష్యత్తులో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఊహించిన శాంసంగ్.. చాట్‌జీపీటీని బ్యాన్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈమధ్య మైక్రోసాఫ్ట్ చాట్‌జీపీటీని బింగ్‌కు లింక్ చేస్తూ.. డైరెక్టుగా ఫోన్లోనే ఇన్‌స్టాల్ చేయాలని కొన్ని కంపెనీలు భావించాయి. అలాంటిది.. శాంసంగ్ మాత్రం అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. చాట్‌జీపీటీ తమ ఫోన్లలో వాడుకలోకి రాకుండా బ్యాన్ చేస్తున్నట్టు శాంసంగ్‌ ప్రకటించింది. అయితే.. ఈ నిర్ణయం తాత్కాలికమే అంటున్నారు. ఉద్యోగుల ప్రొడక్టివిటీ, సామర్థ్యాన్ని పెంచుతూ ఏఐని సురక్షితంగా వినియోగించేలా రివ్యూ చేస్తున్నామని, అప్పటి వరకు దీన్ని నిలిపేస్తున్నట్టు ప్రకటించింది శాంసంగ్. అయితే, ఈ నిర్ణయానికి కూడా కంపెనీ ఉద్యోగులు చేసిన మిస్టేక్ అని తెలుస్తోంది. శాంసంగ్ సెమీ కండక్టర్ డిపార్ట్‌మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగి.. తమ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేసేందుకు చాట్‌జీపీటీ ఉపయోగించాడు. కాకపోతే, ఇందుకోసం కొత్త ప్రోగ్రామ్‌ సోర్స్‌కోడ్‌ను చాట్‌జీపీటీకి షేర్ చేశాడు. ఇది హైలీ సెన్సిటివ్ డేటా. దీంతో పాటు ఇంటర్నల్ హార్డ్‌వేర్‌ విభాగంపై తయారు చేసిన నోట్స్‌ను కూడా చాట్‌జీపీటీకి అందించాడు. ఇలాంటి  పొరపాట్లు శాంసంగ్ కంపెనీలో నెల రోజుల్లోనే మూడు సార్లు జరిగాయి. అందుకే, శాంసంగ్ ఈ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత డేంజర్ అనేది బయటి ప్రపంచానికి చెప్పేందుకు.. గాడ్‌ఫాదర్‌ ఆఫ్‌ ఏఐగా పేరున్న జాఫ్రీ హింటన్‌.. గూగుల్‌కు రాజీనామా చేశారు. ఇవన్నీ చూస్తుంటే… చాట్ జీపీటీని ఎంకరేజ్ చేస్తారా.. అన్ని దేశాలు కలిసి దీన్ని బ్యాన్ చేసేందుకు ఓ నిర్ణయం తీసుకుంటారా అనేది వేచి చూడాలి. 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News