Big Stories

Cars : అందరికీ పెద్ద కార్లే కావాలి… చిన్న కార్లు కొనకపోవడం ఆర్థిక వ్యవస్థకు డేంజర్

- Advertisement -

Cars : చిన్న కార్ల అమ్మకాలు తగ్గిపోతున్నాయి. అందరూ పెద్ద కార్లే కొంటున్నారు. సాధారణంగా పెద్ద కార్ల అమ్మకాలు బాగున్నాయంటే.. ఆర్థిక వ్యవస్థకు మంచిదేగా అనుకుంటారు. దేశంలో డబ్బున్న వాళ్లు పెరుగుతున్నారనో, ప్రజల చేతిలో ఎక్కువ డబ్బులు ఉన్నాయనో భావిస్తారు. కాని, ఇక్కడ మాత్రం ఆ ఫార్ములా అప్లై అవదు. పూర్తిగా రివర్స్. చిన్న కార్ల అమ్మకాలు సరిగా లేకపోతే… ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదనే అర్థం. గ్రామాల్లోని వాళ్లు, మధ్య తరగతి వాళ్లు కొనుక్కునేది చిన్న కార్లనే. ఈ రకంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇంకా కుదుటపడలేదనే అర్థం. పైగా పెద్ద కార్ల అమ్మకాలు పెరిగినట్టుగా అనిపిస్తున్నప్పటికీ.. ఒకప్పుడు ఇదే అమ్మకాల్లో చిన్న కార్లకు కూడా మంచి డిమాండ్ ఉండేది. ఇప్పుడా స్పేస్ తగ్గిపోయిందంటే ఏంటి అర్థం.

- Advertisement -

దేశంలో అమ్ముడవుతున్న ప్రతి 10 కార్లలో 5 కార్లు స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్, నాలుగు హ్యాచ్ బ్యాక్, ఒక వ్యాన్ ఉన్నాయి. ఇక టాప్-10 కార్లలో 6 కార్లు అమ్ముడైనవి మారుతి సుజుకి కంపెనీవే. హ్యుండాయ్ మోటార్స్, టాటా మోటార్స్ తరువాత పొజిషన్‌లో ఉన్నాయి. గత నెలలో మొత్తం 3 లక్షల 31వేల 747 కార్లు అమ్ముడయ్యాయి. మారుతి సుజుకి కార్లలో వ్యాగన్-ఆర్, బ్రెజా, మారుతి సుజుకి ఎకో, స్విఫ్ట్‌‌‌‌, సెలెరియా, ఇగ్నిస్‌‌‌‌, బాలెనో, డిజైర్‌‌‌‌‌‌‌‌ వంటి కాంపాక్ట్  కార్ల సేల్స్ పెరిగాయి. హ్యుండాయ్ క్రెటా, హ్యుండాయ్ వెన్యూకు గిరాకీ బాగా ఉంది. టాటా నెక్సాన్, టాటా పంచ్ అమ్మకాలు కూడా బాగున్నాయి. అయితే, మారుతి సుజుకీ మోడల్స్ ఆల్టో, ఎస్‌‌‌‌– ప్రెస్సో వంటి చిన్న కార్ల అమ్మకాలు తగ్గాయి. మరోవైపు టయోటా బ్రాండ్ అమ్మకాలు కూడా తగ్గాయి.

కియా బ్రాండ్‌కు మాత్రం భలే డిమాండ్ పెరిగింది. సెల్టోస్‌‌‌‌, కేరన్స్‌‌‌‌ మోడల్స్‌కు డిమాండ్ బాగుంది. అటు ఎంజీ మోటార్ సేల్స్ కూడా రెండింతలు పెరిగాయి. ఈ మధ్యే విడుదల చేసిన సరికొత్త ఈవీ కార్ సేల్స్ ఎలా ఉంటాయో చూడాలి. 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News