BigTV English

Heaviest Man : 5 ఏళ్లుగా సోఫాకే అంకితం.. భారీకాయుడి మృతి

Heaviest Man : 5 ఏళ్లుగా సోఫాకే అంకితం.. భారీకాయుడి మృతి
Heaviest Man

Heaviest Man : ప్రపంచంలోని భారీకాయుల్లో ఆ రష్యన్ ఒకడు. అధిక బరువు కారణంగా ఐదేళ్లుగా సోఫాకే పరిమితమయ్యాడు. బరువును తగ్గించుకునే క్రమంలో 60 ఏళ్ల లియోనిద్ ఆండ్రీవ్ మరణించాడు. అతని బరువు 281 కిలోలు. అథ్లెట్ కావాలనేది అతని కల.


దశాబ్దం క్రితం అతనో హంటర్. అప్పట్లో అతని బరువు 77 కిలోల బరువు మాత్రమే. సొంతంగా వ్యవసాయ క్షేత్రాన్ని చూసుకునేవాడు. ఇక వ్యవసాయ పనుల్లో ఎంతో చలాకీ. ఆర్మీ నుంచి బయటికొచ్చినప్పుడే బరువు సమస్య ఎదురైంది. మూడంటే మూడే నెలల్లో దాదాపు రెట్టింపయ్యాడు.

106 కిలోలకు బరువు పెరిగిన తర్వాత.. ఇక ఆగలేదు. పెరుగుతూనే ఉన్నాడు. జీవక్రియలో లోపం వల్లే బరువు పెరుగుతున్నట్టు వైద్యులు గుర్తించి.. అతడిని హెచ్చరించారు. మెటాబాలిక్ డిజార్డర్ కారణంగా ఊహించనంత భారీకాయం వచ్చేసింది. బరువు పెరుగుదల వల్ల సొంతంగా ఏ పనులూ చేసుకోలేని అశక్తతకు చేరాడు.


సోఫాకే పరిమితమై ఒంటరి జీవితం గడపాల్సి వచ్చింది. రెండు సార్లు వివాహమైనా.. విడాకులతోనే ఆ జీవితం ముగిసింది. అతడిని చూసుకునేందుకు సంతానం కూడా లేదు. ఇరుగుపొరుగు వారు అతడికి సాయం చేసేవారు. ఆండ్రీవ్ బరువు పెరగకుండా వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.

గత వారం చనిపోవడానికి కొన్ని రోజుల ముందే బరువు తగ్గే ప్రయత్నంలో భాగంగా డైట్ మార్పు చేశాడు. పిండిపదార్థాలకు గుబ్ బై చెప్పడమే కాదు.. అతి స్వల్ప మొత్తంలో ఆహారం తీసుకునేవాడు. ఓ కప్పు సూప్‌తో లంచ్ ముగించేవాడు. తాను బరువు తగ్గుతానని స్థానిక విలేకరులకు చెప్పాడు. ఆపై కొన్ని రోజులకే ఆండ్రీవ్ మరణించాడు.

Related News

Philippines: చిగురుటాకులా వణికిన ఫిలిప్పీన్స్‌.. వరుసగా మూడు భూకంపాలు, 22 మంది మృతి

USA: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..

Indonesia News: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

Myanmar: మయన్మార్‌లో భూకంపం.. 4.7గా నమోదు, భారత్‌లోనూ ప్రకంపనలు

London News: గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు.. లండన్‌లో వెర్రి చేష్టలు, వెనుకున్నదెవరు?

Lawrence Bishnoi Gang: లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చుట్టూ ఉచ్చు.. కెనడా సంచలనం నిర్ణయం

Donald Trump: టాలీవుడ్‌కు ట్రంప్ షాక్.. ఇక అమెరికాలో తెలుగు సినిమాలు రిలీజ్ కష్టమేనా?

Pakistan: మీ పాలన మాకొద్దు.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో తీవ్ర ఉద్రికత్త

Big Stories

×