E-Paper
Advertisement

Aadudam Andhra: ఏపీలో “ఆడుదాం ఆంధ్రా”.. 12 కోట్లు ప్రైజ్ మనీ.. రిజిస్ట్రేషన్లు షురూ

Aadudam Andhra: ఏపీలో “ఆడుదాం ఆంధ్రా”.. 12 కోట్లు ప్రైజ్ మనీ.. రిజిస్ట్రేషన్లు షురూ
Advertisement

Aadudam Andhra: ఏపీ ప్రభాత్వం క్రీడా సంరంభానికి తెరలేపింది. “ఆడుదాం ఆంధ్రా” పేరుతో భారీ ఎత్తున క్రీడా పోటీల నిర్వహణకు జగన్ సర్కార్ సిద్ధమైంది. పలు క్రీడా అంశాల్లో ఈ పోటీలు జరగనుండగా.. నేడు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన ఆటగాళ్లు (15 ఏళ్లకంటే ఎక్కువ వయసు) తమ పేరు, వివరాలను సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకోవాలి. డిసెంబర్ 13 వరకూ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని.. వాలంటీర్ల ద్వారా లేదా.. https://aadudamandhra.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా కానీ ,1902 ఫోన్ నంబర్ ద్వారా కానీ వివరాలను నమోదు చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ క్రీడలు డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 3 వరకూ జరుగుతాయి.

ఈ పోటీల్లో మొత్తం రూ.12 కోట్ల ప్రైజ్ మనీని అందించనున్నారు. పోటీదారులే కాకుండా.. పోటీలను వీక్షించే వారు కూడా రిజిస్టర్ చేసుకునేలా వెబ్ సైట్ లో అవకాశం కల్పించారు. కాగా.. ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలకు ప్రముఖ క్రీడాకారులు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు, క్రికెటర్లు అంబటి రాయుడు, ఎమ్మెస్కే ప్రసార్, శ్రీకర్ భరత్, భరత్ అరుణ్, హనుమ విహారి, చెస్ ప్లేయర్స్ ద్రోణవల్లి హారిక, పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, లలిత్ బాబు, బి. ప్రత్యూష, బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, చేతన్ ఆనంద్, కిదాంబి శ్రీకాంత్ తదితరులు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు.

Related News

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

Big Stories

Advertisement
×