BigTV English

Bird flu death: ప్రపంచంలో బర్డ్ ఫ్లూతో తొలి మృతి నమోదు.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ అలర్ట్

Bird flu death: ప్రపంచంలో బర్డ్ ఫ్లూతో తొలి మృతి నమోదు.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ అలర్ట్

Worlds first human bird flu death: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. బర్డ్ ఫ్లూ కారణంగా ప్రపంచంలోనే మొదటి మరణం నమోదు అయ్యిందని పేర్కొన్నది. బర్డ్ ఫ్లూతో మెక్సికోలో 59 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అయితే, ఆ వ్యక్తికి వైరస్ ఎలా సోకిందనే విషయాన్ని మాత్రం ఐక్యరాజ్య సమితికి చెందిన ఈ ఏజెన్సీ వెల్లడించలేదు. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుండడం, విరేచనాలు తదితర లక్షణాలతో బాధితుడిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆ వ్యక్తి అప్పటికే దీర్ఘకాలిక మూత్రపిండాల వైఫల్యం, మధుమేహం, అధిక రక్తపోటు వ్యాధులతో బాధపడుతున్నాడు.


గత నెల 23న ఈ కేసు గురించి తమకు తెలిసిందంటూ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. ఇది కరోనా వైరస్ కంటే వంద రెట్లు ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ అంటూ వైద్య నిపుణులు భావిస్తున్నారు. యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అందించిన నివేదికలో ప్రస్తుతానికి ఒకరి నుండి మరొకరికి హెచ్5ఎన్1 వైరస్ సోకిన సందర్భాలు మాత్రం కనిపించలేదు. అయినా కూడా ఈ వైరస్ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

ఈ వైరస్ కు సంబంధించిన లక్షణాలను కూడా తెలియజేసింది. వైరస్ సంక్రమించినప్పుడు దాని లక్షణాలు తేలికపాటి నుండి తీవ్ర స్థాయి వరకూ ఉంటాయని తెలిపింది. బర్డ్ ఫ్లూపై భారత ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో ఓ సూచన చేసింది. ఈ వైరస్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.


Also Read: ఎన్డీఏ హ్యాట్రిక్.. ప్రధాని మోదీకి దేశాధినేతల శుభాకాంక్షలు

కరోనా కంటే ప్రమాదకరమైనటువంటిదిగా పరిగణిస్తున్న హెచ్5 ఎన్1(ఏవియన్ ఇన్ల్పఎంజా) పలు దేశాలకు విస్తరిస్తుంది. ఈ వైరస్ పశువులు, పాల ద్వారా మనుషులకు సోకుతోంది. ఇప్పటికే అమెరికాలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అయ్యాయి.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×