BigTV English

PM Modi: ఎన్డీఏ హ్యాట్రిక్.. ప్రధాని మోదీకి దేశాధినేతల శుభాకాంక్షలు

PM Modi: ఎన్డీఏ హ్యాట్రిక్.. ప్రధాని మోదీకి  దేశాధినేతల శుభాకాంక్షలు

World Leaders Wishes to PM Modi: లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి మూడో సారి మోదీ ప్రధాని పీఠం ఎక్కేందుకు సిద్ధమైన సందర్భంగా మోదీకి వివిధ దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఎక్స్ వేదికగా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.


భారత్, ఇటలీ మధ్య స్నేహ బంధాన్ని బలోపేతం చేయడానికి, రెండు దేశాల ప్రజల శ్రేయస్సు కోసం పరస్పర సహకారం దిశగా కలిసి పనిచేయాలని మెలోనీ పేర్కొన్నారు. పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, భూటాన్‌తో పాటు పలువురు దేశాల అధినేతలు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

కలిసి పనిచేద్దాం..
మోదీ నాయకత్వంలో సాధించిన ప్రగతి, శ్రేయస్సుపై భారత ప్రజలు నమ్మకాన్ని చూపించారని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్కమ సింఘె ఎక్స్ వేదికగా తెలిపారు. భారత్‌తో భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు శ్రీలంక ఎదురు చూస్తోందని ట్వీట్ చేశారు. అంతే కాకుండా సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు ప్రధాని మోదీకి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మెయిజ్జు అభినందనలు తెలిపారు. భారత్ మాల్దీవుల మధ్య స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఎదరుచేస్తున్నా.. అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

పురోగతి సాధిస్తూనే ఉండాలి

నేపాల్ పీఎం కమల్ దహల్ ప్రచండ మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఎక్స్ వేదికగా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్‌ పీఎంతో పాటు భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్‌గే కూడా మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. చారిత్రాత్మకంగా మూడో సారి విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. మారిషస్ ప్రధాని ప్రవింద కుమార్ కూడా మోదీకి అభినందనలు తెలిపారు. మోదీ నేతృత్వంలో భారత్ విశేష పురోగతి సాధిస్తూనే ఉంటుందని అన్నారు.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×