BigTV English

Brahmaji: వాళ్లు చేసిన తప్పే మీరూ చేయకండి.. బ్రహ్మాజీ హితోపదేశం

Brahmaji: వాళ్లు చేసిన తప్పే మీరూ చేయకండి.. బ్రహ్మాజీ హితోపదేశం

Brahmaji: జీవితంలో మనకంటూ ఒకరోజు వస్తుంది.. ఆరోజు కోసం అలుపెరగకుండా పోరాటం చేస్తే విజయం కచ్చితంగా మన వెంట వస్తుంది. ఇదే సిద్ధాంతాన్ని రాజకీయాల్లో కూటమి అవలంబించింది. పదేళ్లుగా ఎన్నో కష్టాలను, అవమానాలను ఎదుర్కున్న పవన్ కళ్యాణ్ కు ఇన్నాళ్లకు విజయం దక్కింది. జనసేన అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఏపీ.. కూటమి చేతికి చేరింది.


టీడీపీ అత్యధిక మెజారిటీతో మళ్లీ రాష్ట్రాన్ని కైవసం చేసుకుంది. ఇక పవన్ కానీ, చంద్రబాబు కానీ.. అధికారం వచ్చిందని అహంకారం చూపించలేదు. తమ పని తాను చేసుకుంటూ పోతున్నారు. అధికారం అహంకారాన్ని ఇవ్వలేదు.. బాధ్యతను ఇచ్చిందని పవన్ చెప్పుకొచ్చాడు. కానీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు మాత్రం రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నారు.

వైసీపీ నాయకులు కనిపించినా.. వారి వాహనాలు కనిపించినా దాడులకు పాల్పడుతున్నారు. గతంలో వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే చేశారో.. ఇప్పుడు అలానే టీడీపీ కూడా చేయడంతో పలువురు వారిని ఖండిస్తున్నారు. అలా చేయడం మంచిది కాదని చెప్పుకొస్తున్నారు. తాజాగా నటుడు బ్రహ్మాజీ కూడా ఈ విషయాన్నే చెప్పుకొచ్చాడు. సినిమాలతో బిజీగా ఉన్న బ్రహ్మాజీ.. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక విషయాన్నీ అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు.


తాజాగా బ్రహ్మాజీ.. కూటమి అభిమానులు చేస్తున్న దాడుల గురించి మాట్లాడాడు. ” పుష్ప షూటింగ్‌లో బిజీగా ఉన్నాను. మళ్లీ పనిలోకి దిగండి. ఉత్సాహం మరియు వినోదం ముగిసింది.. AP సురక్షితమైన చేతుల్లో ఉంది.మీ భవిష్యత్తుపై దృష్టి పెట్టండి.. ట్రోలింగ్ మన ఉద్దేశ్యం కాదు.. మంచి భవిష్యత్తు కోసం, మన కోసం మనం పని చేద్దాం.. వాళ్ళు తప్పు చేస్తే మళ్లీ మీరు అదే తప్పు చేయకండి” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. నిజం చెప్పారు.. వాళ్లు దాడులు చేశారని మనం చేస్తే వాళ్లకు, మనకు తేడా ఉండదు అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. మరి టీడీపీ కార్యకర్తలు వీటిని ఇకనైనా ఆపుతారేమో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×