BigTV English

Allu Arjun: అల్లు అర్జున్ ఎఫెక్ట్.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్‌పై మరో దెబ్బ..

Allu Arjun: అల్లు అర్జున్ ఎఫెక్ట్.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్‌పై మరో దెబ్బ..

Allu Arjun: ప్రతీ ఏరియాకు పేరు తెచ్చిపెట్టే ఒక థియేటర్ ఉంది. చాలావరకు మూవీ లవర్స్ అంతా ఆ ఒక్క థియేటర్‌లోనే సినిమా చూడడానికి ఇష్టపడతారు. ఏదైనా కొత్త సినిమా విడుదలయ్యిందంటే చాలు.. ముందుగా ఆ థియేటర్‌లోనే టికెట్స్ హౌస్‌ఫుల్ అవుతాయి. హైదరాబాద్‌లో అలాంటి థియేటర్ ఏది అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్. సినిమాలకు, హీరోలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నట్టే సంధ్య థియేటర్‌కు కూడా ఉంది. కానీ అల్లు అర్జున్ వల్ల, తను నటించిన ఒక్క సినిమా వల్ల సంధ్య థియేటర్ కళ పూర్తిగా మారిపోయింది. ఇప్పటికే ఈ థియేటర్‌కు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. తాజాగా దీనిపై మరో దెబ్బ పడింది.


పండగ లేదు

మామూలుగా ప్రతీ ఏడాది శివరాత్రికి మూవీ లవర్స్ అంతా జాగారం చేయడం కోసం పాత సినిమాలను వరుసగా ప్లే చేస్తూ ఉండేది సంధ్య థియేటర్ యాజమాన్యం. కానీ ఈసారి అలా జరగదు అని ప్రకటించేసింది. ఈ శివరాత్రికి మిడ్‌నైట్ స్పెషల్ షోలు ఉండవని తేల్చి చెప్పేసింది. దీంతో మూవీ లవర్స్ చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. శివరాత్రికి ఈ థియేటర్‌లో ఏ సినిమా విడుదలయినా కూడా దానిని చూడడానికి ప్రేక్షకులు భారీ సంఖ్యలో వచ్చేవారు. పండగ మొత్తం ఇక్కడే జరుపుకునేవారు. అలాంటి ఈసారి అలా కుదరదు అని తెలియడంతో వారంతా చాలా ఫీల్ అవుతున్నారు. దీంతో సంధ్య థియేటర్ వింటేజ్ లుక్‌ను పూర్తిగా కోల్పోయిందని కామెంట్స్ చేస్తున్నారు.


భారీ సంఖ్యలో జనం

దాదాపు మూడు నెలల క్రితం.. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన ‘పుష్ప 2’ స్పెషల్ ప్రీమియర్స్ కోసం సంధ్య థియేటర్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు ఫ్యాన్స్. అదే సమయంలో అల్లు అర్జున్ కూడా అక్కడికి వస్తున్నాడని తెలిసి థియేటర్‌లోకి మరికొందరు వచ్చేశారు. షో మొదలయ్యే ముందే అల్లు అర్జున్ రోడ్ షో చేస్తూ థియేటర్‌లోకి ఎంటర్ అవ్వడం మొదలుపెట్టాడు. థియేటర్ బయట ఉన్న చాలామంది ప్రజలు అల్లు అర్జున్ రోడ్ షో చేస్తూ సంధ్య థియేటర్ లోపలికి వెళ్లడం గమనించారు. దీంతో సినిమాకు టికెట్స్ లేకపోయినా చాలామంది థియేటర్ లోపలికి వచ్చేశారు. అలా తొక్కిసలాట జరిగింది. ఒక మహిళ ప్రాణం పోయింది.

Also Read: బ్రేక్ ఈవెన్ టార్గెట్ మరీ ఇంత తక్కువా.? అయినా సందీప్‌కు సవాలే.. 

ఎవరిది తప్పు.?

‘పుష్ప 2’ (Pushpa 2) ప్రీమియర్స్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించింది. అంతే కాకుండా రేవతి కుమారుడు అయిన శ్రీతేజ్‌కు ఆ జనాల మధ్య ఊపిరాడక బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది. అలా రేవతి మరణానికి పరోక్షంగా అల్లు అర్జున్ రోడ్ షో చేస్తూ ఆ థియేటర్‌కు రావడమే అని చాలామంది ప్రేక్షకులు తనను నిందించారు. అందుకే ఈ హీరోపై కేసు నమోదయ్యింది. అంతే కాకుండా ఒక రోజంతా జైలులో కూడా ఉండి బయటికి వచ్చాడు. ఇప్పటికీ ఈ విషయంలో అల్లు అర్జున్‌దే తప్పు అంటున్నవారు ఉన్నారు. మరోవైపు హీరో తప్పేమీ లేదంటూ తనకే సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×