ECIL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. బీఈ/బీటెక్ (మెకానికల్/ ఎలక్ట్రానిక్స్, ఈసీఈ), ఐటీఐ, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు మంచి వేతనం కూడా కల్పించనున్నారు.
హైదరాబాద్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL) ఒప్పంద ప్రాతిపదికన పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 5న దరఖాస్తు గడువు ముగియనుంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓ సారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
ALSO READ: UPSC Recruitment: గోల్డెన్ ఛాన్స్.. యూపీఎస్సీలో 752 ఉన్నత ఉద్యోగాలు.. అవకాశం మళ్లీ రాదు భయ్యా..
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 17
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్, సీనియర్ ఆర్టీసన్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
వెకెన్సీ వారీగా ఖాళీలను చూసినట్లయితే..
అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్: 11 ఉద్యోగాలు
సీనియర్ ఆర్టీసన్-1: 6 ఉద్యోగాలు
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 5 (దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మార్చి 5 లోగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు)
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్(మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఈసీఈ), ఐటీఐ, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 30 ఏళ్ల వయస్సు మించరాదు.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగానికి నెలకు రూ.45,000 నుంచి రూ.60,000 జీతం ఉంటుంది. సీనియర్ ఆర్టీసన్ ఉద్యోగానికి నెలకు రూ.22,718 వేతనం ఉంటుంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
చిరునామా: ఈసీఐఎల్ రీజినల్ ఆఫీస్, డోర్ నెం.47-09-28/10, ముకుంద్ సువాస అపార్ట్‌మెంట్స్, 3వ లేన్, ద్వారకా నగర్, విశాఖపట్నం-530016 అడ్రస్ కు దరకాస్తు పంపాలి.
ఇంటర్వ్యూ తేది: మార్చి 5, 6
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.ecil.co.in/
ALSO READ: SBI Recruitment: శుభవార్త.. SBIలో 1194 ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు..!
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం పొందిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా కల్పించనున్నారు.
ముఖ్యమైనవి:
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 5
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 17