CBI Recruitment: నిరుద్యోగులకు ఇది బంపర్ ఆఫర్. ప్రభుత్వం గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ప్రభుత్వం రంగ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్నఅభ్యర్థులందరూ ఆన్ లైన్ లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 20వ తారీఖును దరఖాస్తు గడువు ముగియనుంది. ఇంకా పది రోజుల సమయం మాత్రమే ఉంది.
గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ అధికారులు విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా కల్పించనున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1000
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
కేటగిరీల వారీగా ఉద్యోగాలు..
జనరల్: 405 ఉద్యోగాలు
ఓబీసీ: 150 ఉద్యోగాలు
ఎస్టీ: 75 ఉద్యోగాలు
ఈడబ్ల్యూఎస్: 100 ఉద్యోగాలు
దరఖాస్తు ప్రారంభ తేది: 2025 జనవరి 30
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 20
విద్యార్హత: ప్రభుత్వం గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీసం 60 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో పాసై ఉంటే సరిపోతుంది.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. రిజర్వ్ డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు, మహిళ అభ్యర్థులకు ఫీజులో రాయితీ ఉంది. వారు రూ.150 పే చేస్తే సరిపోతుంది.
ఉద్యోగ దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు పూర్తి స్థాయి ఉద్యోగులుగా చేరడానికి ముందు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్(పీజీడీబీఎఫ్) లో వన్ ఇయర్ పోస్ట్ గ్యాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
వేతనం: ఉద్యోగానికి ఎంపికై అభ్యర్థులకు నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు వేతనం కల్పించనున్నారు.
పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి
అఫీషియల్ వెబ్ సైట్: https://www.centralbankofindia.co.in
అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ప్రభుత్వం గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీసం 60 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో పాసై ఉంటే సరిపోతుంది. ఇందులో ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కూడా కల్పించనున్నారు. వెంటనే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్
Also Read: BC commission report: రేవంత్ సర్కార్‌కు డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్ట్.. రిజర్వేషన్లు ఇలా..!
ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1000
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 20
note: ఇంకా పది రోజుల సమయం మాత్రమే ఉంది.