BigTV English

BC commission report: రేవంత్ సర్కార్‌కు డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్ట్.. రిజర్వేషన్లు ఇలా..!

BC commission report: రేవంత్ సర్కార్‌కు డెడికేటెడ్ బీసీ కమిషన్ రిపోర్ట్.. రిజర్వేషన్లు ఇలా..!

BC commission report: తెలంగాణ సర్కార్ కు డెడికేటెడ్ బీసీ కమిషన్ నివేదకి పంపంది. బీసీ కమిషన్ చైర్మన్ 700 పేజీలతో నివేదిక అందజేశారు. సంబంధించిన రిపోర్టును బీసీ సంక్షేమ శాఖకు పంపనున్నారు. కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. గ్రామం ఒక యూనిట్ గా వార్డు సభ్యుల రిజర్వేషన్లు అందుబాటులోకి రావాలని నివేదకలో పేర్కొంది. అలాగే మండలం ఒక యూనిట్ గా ఎంపీటీసీ రిజర్వేషన్లు అందుబాటులోకి రావాలని తెలిపింది. జిల్లాను ఒక యూనిట్ గా జెడ్పీటీసీల రిజర్వేషన్లు ఖరారు చేసినట్లుగా రిపొర్టులో పేర్కొంది. రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకుని.. జడ్పీ చైర్మన్ రిజర్వేషన్ ను పంచాయతీ రాజ్ శాఖ ఖరారు చేసింది. అసెంబ్లీ సెగ్మంట్లు వారిగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని కమిషన్ సూచించినట్లు తెలుస్తోంది. మొత్తం ఆరు సెగ్మంట్లు రూపంలో డెడికేషన్ కమిషన్ ఇచ్చినట్లు సమాచారం. డెడికేటెడ్‌ కమిషన్‌ దాదాపు మూడు నెలలు బీసీ రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.


తెలంగాణలో కులగణన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేషన్ కమిషన్ తన రిపోర్టును గవర్నమెంట్ కు అందజేసింది. కమిషన్ చైర్మన్ మాజీ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కలిసి రిపోర్టును అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ ల కల్పన కోసం రాజకీయంగా వెనుకబడిన వర్గాల(బీసీ-బ్యాక్ వర్డ్ క్లాసెస్) జనాభా లెక్కల సేకరణకు ప్రత్యేకంగా గతేడాది నవంబర్ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. మాజీ ఐఏఎస్ ఆఫీసర్ భూసాని వెంకటేశ్వర రావు నేతృత్వంలో ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ను నియమించింది.

Also Read: CM Revanth Reddy: చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్..


డెడికేషన్ కమిషన్ ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వెళ్లి ప్రజల అభిప్రాయాలను సేకరించింది. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్యూమరేటర్లు సేకరించిన సమాచారాన్ని ఆన్ లైన్ చేయడం పూర్తి కాగానే ఆ రిపోర్టును ప్లానింగ్ డిపార్ట్ మెంట్ బీసీ డెడికేటెడ్ కమిషన్ కు అందజేసింది. ఈ డేటా మొత్తాన్ని ఒక్క దగ్గరకు చేర్చి పూర్తి చేసిన డెడికేటెడ్ కమిషన్.. ఈ రోజు సచివాలయంలో సీఎస్ శాంతా కుమారికి కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వర రావు సచివాలయంలో అందజేశారు. సంబంధించిన రిపోర్టును ప్రభుత్వానికి చేరడంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం ఓ కొలిక్కి వచ్చి ఎన్నికల దిశగా ప్రభుత్వం ముందడుగు వేసేందుకు కీలకం కాబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Coconut Water: కొబ్బరి నీళ్లు తాగితే.. ఎన్ని ప్రయోజనాలుంటాయో తెలిస్తే, అస్సలు వదిలిపెట్టరు !

డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా గ్రామ వార్డు నుంచి జడ్పీ చైర్మన్ దాకా తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ రిజర్వేషన్లను ఖరారు చేయనుంది.

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×