Bandla Ganesh..ప్రముఖ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) తాజాగా నటిస్తున్న చిత్రం ‘లైలా’. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆకాంక్ష శర్మ (Akanksha Sharma) హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సాహూ గారపాటి (Sahoo Garapati) నిర్మిస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న నేపథ్యంలో సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఆదివారం హైదరాబాదులో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) చీఫ్ గెస్ట్లుగా విచ్చేశారు. ఇక ఇదే ఈవెంట్లో 30 ఇయర్స్ పృథ్వీ (Prudhvi Raj) చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపాయి. ముఖ్యంగా ఆయన వైసీపీ పార్టీని టార్గెట్ చేస్తూ.. రాజకీయ వివాదాలు సృష్టించారు. ఈ క్రమంలోనే లైలా సినిమాని బాయ్ కాట్ చేయాలి అంటూ దాదాపు 25 వేలకు పైగా ట్వీట్లు పడ్డాయి. ఇక సినిమాపై ట్రోలింగ్ ఎక్కువవుతున్న నేపథ్యంలో తాజాగా విశ్వక్ సేన్ (Vishwak Sen) తో పాటు ఆ చిత్రం నిర్మాత సాహు గారపాటి కూడా స్పందించారు.
పృథ్వీ మాటలపై బండ్ల గణేష్ ఫైర్..
ఇకపోతే వివాదం కాస్త ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రముఖ చిత్ర నిర్మాత, రాజకీయవేత్త బండ్ల గణేష్ (Bandla Ganesh) కూడా ఒక ట్వీట్ వేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన మాట్లాడుతూ.. “రాజకీయాలను, సినిమాలను ఒకటిగా ఎప్పుడూ ఎవరూ చూడకూడదు. రాజకీయాలలో ఉంటూ సినిమాలు చేసే నటీనటులు ఏ సందర్భంలో కూడా సినిమా వేదికల పైన రాజకీయాల గురించి మాట్లాడకూడదు. అలాగే రాజకీయాలు చేయకూడదు. అలాంటి వారి విషయంలో నిర్మాతలు కూడా జాగ్రత్త వహించాలి.నటీనటుల నోటి దూల వల్ల సినిమాలకు సమస్య రావడం అత్యంత దారుణం. సినిమాను సినిమాగా మాత్రమే చూడాలి” అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
పృథ్వీ కామెంట్స్ పై క్షమాపణ కోరిన విశ్వక్ సేన్..
ఇదే విషయంపై విశ్వక్ సేన్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఒకరు చేసిన తప్పుకి సినిమా మేము బాధితులం కాదు కదా.. ఏం మాట్లాడుతారో మాకు తెలియదు. అయితే పృథ్వీ మాట్లాడుతున్నప్పుడు.. మేము అక్కడ లేము. చిరంజీవి గారు వస్తే ఆయనను రిసీవ్ చేసుకోవడానికి బయటకు వెళ్ళాము. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లి చూస్తే సోషల్ మీడియా అంతా కూడా బాయ్ కాట్ లైలా అని కనిపించింది.ఇక అసలు విషయం ఏంటి అని ఆరా తీయగా.. అప్పుడే మాకు అర్థం అయింది. దయచేసి మా సినిమాని చంపేయొద్దు” అంటూ రిక్వెస్ట్ చేసుకున్నారు విశ్వక్ సేన్.
పృథ్వీ ఏమన్నారంటే..
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీ మాట్లాడుతూ ..నేను సత్తి క్యారెక్టర్ లో నటించాను. ఇందులో షాట్ మధ్యలో మేకలు ఎన్ని ఉన్నాయని అడిగితే ..150 అని చెప్పారు. యాదృచ్ఛికము ఏమో తెలియదు కానీ..సినిమా చివర్లో లెక్కిస్తే కరెక్ట్ గా 11 గొర్రెలే ఉన్నాయి. ఇదేంటో అర్థం కాలేదు కానీ సినిమా మొత్తం బ్రహ్మాండంగా ఉంది అంటూ తెలిపారు. దీంతో వైసీపీ నాయకులను టార్గెట్ చేసి పృథ్వీ మాట్లాడినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికలలో వైసీపీ గెలిచినప్పుడు ఏకంగా 151 సీట్లు వైసిపి సొంతం చేసుకుంది. 2024 ఎన్నికలలో కేవలం 11 సీట్లకే పరిమితం అవడంతో ఈ రకంగా కామెంట్లు చేశారని వైసీపీ శ్రేణులు మండి పడుతూ.. బాయ్ కాట్ లైలా అంటూ పెద్ద ఎత్తున ట్వీట్ చేశారు.
రాజకీయం సినిమా రంగాలు ఒకటిగా చూడకూడదు.
రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసే నటీ,నటులు సినిమా వేదికలపై రాజకీయాలు చేయకూడదు.
ఇలాంటి వారి విషయం లో నిర్మాతలు జాగ్రత్త వహించాలి.
నటించిన వారి నోటి దూలకు సినిమా లకు సమస్య రావడం దారుణం.
సినిమా ను సినిమా గా చూడండి..All the best to laila…
— BANDLA GANESH. (@ganeshbandla) February 10, 2025