BigTV English

MECL: టెన్త్, ఐటీఐతో ఉద్యోగాలు.. రూ.55,900 జీతంతో ఉద్యోగాలు, ఇంకా కొన్ని రోజులే భయ్యా..

MECL: టెన్త్, ఐటీఐతో ఉద్యోగాలు.. రూ.55,900 జీతంతో ఉద్యోగాలు, ఇంకా కొన్ని రోజులే భయ్యా..

MECL Jobs: మినిరత్న-1 హోదా కలిగిన మినరల్ ఎక్స్ ఫ్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (ఎంఈసీఎల్) ‌నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్ట్ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. టెన్త్, ఐటీఐ, డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులవుతారు. నోటిఫికేషన్ కు సంబంధించిన పోస్టుల వివరాలు, విద్యార్హత, ముఖ్యమైన డేట్స్, ఉద్యోగ ఎంపిక విధానం గుర్తించి తెలుసుకుందాం.


కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, మైన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన మినిరత్న-1 హోదా కలిగిన మినరల్ ఎక్స్‌ప్లోరేషన్‌ & కన్సల్టెన్సీ లిమిటెడ్ (MECL), దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్ట్ కార్యాలయాల్లో ఖాళీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 14వ తేదీ నుంచి జులై 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 108


మినరల్ ఎక్స్‌ప్లోరేషన్‌ & కన్సల్టెన్సీ లిమిటెడ్‌లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. అకౌంటెంట్, హిందీ ట్రాన్స్ లేటర్, టెక్నీషియన్, లాబొరేటరీ టెక్నీషియన్, అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, హిందీ అసిస్టెంట్, జూనియర్ డ్రైవర్, మెకానిక్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు:

1. అకౌంటెంట్: 06
2. హిందీ ట్రాన్స్‌లేటర్: 01
3. టెక్నీషియన్‌ (సర్వే/డ్రాఫ్ట్స్‌మెన్): 15
4. టెక్నీషియన్‌ (శాంప్లింగ్): 02
5. లాబొరేటరీ టెక్నీషియన్: 03
6. అసిస్టెంట్ (మెటీరియల్స్): 16
7. అసిస్టెంట్ (అకౌంట్స్): 10
8. స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్): 04
9. హిందీ అసిస్టెంట్‌: 01
10. ఎలక్ట్రిషియన్: 01
11. మెషినిస్ట్: 05
12. డ్రిల్లింగ్ టెక్నీషియన్: 12
13. మెకానిక్: 01
14. మెకానిక్-కమ్-ఆపరేటర్ (డ్రిల్లింగ్): 25
15. జూనియర్ డ్రైవర్: 06

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, బీఎస్సీ, టెన్త్, ఐటీఐ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు దాటరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. రూ.19,600 నుంచి రూ.55,900 జీతం ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫోటో, సైన్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ స్కాన్ చేసి అప్లడో చేయాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జూన్ 14

దరఖాస్తుకు చివరి తేది: 2025 జులై 5

నోటిఫికేషన్‌కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.

అఫీషియల్ వెబ్ సైట్: www.mecl.co.in

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.

ఉద్యోగ ఎంపిక విధానం: స్క్రీనింగ్, రాత పరీక్ష ద్వారా సెలెక్ట్ చేస్తారు. మహరాష్ట్ర, నాగపూర్‌లో నిర్వహిస్తారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్: స్కిల్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల సెలక్షన్ ఉంటుంది. తుది మెరిట్ లిస్ట్ రాత పరీక్ష మార్కుల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.

ALSO READ: DMHO Jobs: అద్భుత అవకాశం.. పదితో సొంత ఊరులో జాబ్.. ఆ జిల్లాలో 1294 ఉద్యోగాలు

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

వెకెన్సీల సంఖ్య: 108

దరఖాస్తుకు చివరి తేది: 2025 జులై 5

Related News

BSF Jobs: బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు

Indian Railway: రైల్వేలో 2418 ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండా ఉద్యోగ నియామకం

Indian Navy: టెన్త్, ఐటీఐ పాసైతే చాలు.. ఇండియన్ నేవీలో ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.. బంగారు భవిష్యత్తు

IB: రూ.69,000 జీతంతో ఉద్యోగాలు.. అవకాశం మళ్లీ రాదు బ్రో.. ఇంకా నాలుగు రోజులే?

Bank of Maharashtra: డిగ్రీ అర్హతతో 500 ఉద్యోగాలు.. జీతమైతే అక్షరాల రూ.93,960.. ఇంకెందుకు ఆలస్యం

EPFO: ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నో కాంపిటేషన్

Big Stories

×