Ram Pothineni: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక దర్శకుడుగా పేరు సాధించడం అనేది మామూలు విషయం కాదు. ఎంతో పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటే గాని దర్శకుడుగా మంచి గుర్తింపును సాధించలేం. కొంతమంది దర్శకులు చాలా ఏళ్లుగా కష్టపడుతూ అలానే మిగిలిపోతారు. కొంతమందికి ఓపికల నశించి వెనక్కి వెళ్ళిపోతారు. ఇంకొంతమంది మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా అదే ప్రయత్నాన్ని చేస్తూ చేస్తూ సక్సెస్ అవుతారు. సినిమా చేయటం ఒక ఎత్తు అయితే ఆ సినిమా సక్సెస్ అవ్వడం అనేది మరో ఎత్తు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది కొత్త దర్శకులు ఎంట్రీ ఇస్తూ వచ్చారు. ముందుగా షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ఇలా చేస్తూ దర్శకుడుగా అవకాశాలు అందుకున్న దర్శకులు కూడా ఉన్నారు. అలాకాకుండా కొన్నేళ్లపాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఆయా హీరోలతో పరిచయాలు పెంచుకొని వాళ్లకు కథలు చెప్పిన దర్శకులు కూడా ఉన్నారు.
రెండేళ్లుగా నాగచైతన్యతో ట్రావెల్
జోష్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నాగచైతన్య. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించకపోయినా కూడా చైతుకు మంచి పేరు తీసుకుని వచ్చింది. అయితే ఇప్పటివరకు చైతు తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాడు. ఇక ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. ఈ తరుణంలో నాగచైతన్య చేయాల్సిన ప్రాజెక్ట్ గురించి ఒక కీలక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కిషోర్ అనే ఒక కొత్త దర్శకుడు తో దాదాపు రెండు సంవత్సరాలు పాటు నాగచైతన్య ట్రావెల్ చేశారట. చైతు హీరోగా ఆ సినిమా చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా నుంచి చైతు తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
చైతు ప్రాజెక్టులోకి రామ్ పోతినేని
నాగచైతన్య కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు చేయకపోవడంతో రామ్ పోతినేని దీనిని చేయడానికి సిద్ధమయ్యారు. దర్శకుడు కిషోర్ చెప్పిన కథ రామ్ కి విపరీతంగా నచ్చిందట. రామ్ కూడా ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రస్తుతం మహేష్ బాబు దర్శకత్వంలో సినిమా అయిపోయిన తర్వాత కిషోర్ తో సినిమా చేసే అవకాశం ఉంది. ఈ సినిమాను బాహుబలి ప్రొడ్యూసర్స్ ఆర్కా మీడియా సంస్థ నిర్మించనుంది. దగ్గుపాటి రానా ఈ సినిమాను ప్రజెంట్ చేయనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.
Also Read: Akhil Lenin Movie Heroine: అఖిల్ హీరోయిన్ శ్రీలీలా కాదు.. కొత్త హీరోయిన్ వచ్చేసింది