DMHO Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ న్యూస్. ఇంకా చెప్పాలంటే ఆ జిల్లా నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పవచ్చు. అది ఏ జిల్లానో కాదండి.. మన అన్నమయ్య జిల్లా. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో మహిళా అభివృద్ధి కోసం గ్రామాల్లో ఆశా వర్కర్ల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారికి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌కు సంబంధించిన విద్యార్హతలు, వయస్సు, ముఖ్యమైన తేదీలు, ఉద్యోగ ఎంపిక విధానం, తదితర వాటి గురించి తెలుసుకుందాం.
అన్నమయ్య జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మహిళా అభివృద్ధి కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్ల పోస్టులకు నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 30న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1294
ఇందులో ఆశా వర్కర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
ఆశా వర్కర్లు : 1294 పోస్టులు
విద్యార్హత: పదో తరగతి పాసై ఉండాలి. ప్రజలతో కలిసిపోయే స్వభావం ఉండాలి. అభ్యర్థి సంబంధిత గ్రామ నివాసై ఉండాలి. (గ్రామ నివాస సర్టిఫికేట్ ఉండాలి. స్థానికంగా పని చేసే సామర్థ్యం ఉండాలి.)
దరఖాస్తుకు చివరి తేది: జూన్ 30
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయస్సు 25 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఫారమ్ ను పూర్తిగా ఫిల్ చేసి.. అవసరమైన సర్టిఫికెట్స్ ను జతచేసి సంబంధిత మెడికల్ ఆఫీసర్ కార్యాలయంలో సమర్పించాలి.
దరఖాస్తు కోసం కావాల్సినవి: పాస్ ఫోటో, స్థానిక నివాస సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డ్, పేరెంట్స్ వివరాలు.
ఉద్యోగ ఎంపిక విధానం: ఉద్యోగ ఎంపిక వివరాలను తెలియజేయలేదు. స్థానికత, విద్యార్హత, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేసే ఛాన్స్ ఉంది.
శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు.
ఒక్కో గ్రామానికి ఒక ఆశా వర్కర్ ఎంపిక చేస్తారు. అదే గ్రామానికి చెందిన అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారు. డాక్యుమెంట్ పరిశీలనలో తప్పులుంటే అప్లికేషన్ రిజక్ట్ చేస్తారు. ఇది గౌరవ వేతన ప్రాతిపదికన ఉద్యోగమని గమనించాలి. ట్రైనింగ్ తర్వాత డ్యూటీలో చేరవచ్చు. నియామక ప్రక్రియలో చిన్న మిస్టేక్ ఉన్నా అప్లికేషన్ రద్దు చేస్తారు. ఇది కాంట్రాక్ట్ పద్దతిలో తీసుకుంటున్నారు.
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సొంత ఊరులో మంచి అవకాశం. మంచి జీతం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించేయండి. ఆల్ ది బెస్ట్.
ALSO READ: NICL: డిగ్రీ అర్హతతో జాబ్స్.. జీతం అక్షరాల రూ.90వేలు, ఇంకా వారం రోజులే సమయం మిత్రమా
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1294
దరఖాస్తుకు చివరి తేది: