E-Paper
Advertisement

MECL Recruitment: టెన్త్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు, అప్లై చేస్తే జాబ్.. జీతం రూ.55,900

MECL Recruitment: టెన్త్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు, అప్లై చేస్తే జాబ్.. జీతం రూ.55,900

MECL Recruitment: మినిరత్న-1 హోదా కలిగిన మినరల్ ఎక్స్ ఫ్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (ఎంఈసీఎల్) ‌నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్ట్ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. టెన్త్, ఐటీఐ, డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులవుతారు. నోటిఫికేషన్ కు సంబంధించిన పోస్టుల వివరాలు, విద్యార్హత, ముఖ్యమైన డేట్స్, ఉద్యోగ ఎంపిక విధానం గుర్తించి తెలుసుకుందాం.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, మైన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన మినిరత్న-1 హోదా కలిగిన మినరల్ ఎక్స్‌ప్లోరేషన్‌ & కన్సల్టెన్సీ లిమిటెడ్ (MECL), దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్ట్ కార్యాలయాల్లో ఖాళీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 14వ తేదీ నుంచి జులై 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ALSO READ: ECIL Jobs: గోల్డెన్ ఛాన్స్.. ఈసీఐఎల్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు, రూ.1,40,000 జీతం

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 108

మినరల్ ఎక్స్‌ప్లోరేషన్‌ & కన్సల్టెన్సీ లిమిటెడ్‌లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. అకౌంటెంట్, హిందీ ట్రాన్స్ లేటర్, టెక్నీషియన్, లాబొరేటరీ టెక్నీషియన్, అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, హిందీ అసిస్టెంట్, జూనియర్ డ్రైవర్, మెకానిక్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు:

1. అకౌంటెంట్: 06
2. హిందీ ట్రాన్స్‌లేటర్: 01
3. టెక్నీషియన్‌ (సర్వే/డ్రాఫ్ట్స్‌మెన్): 15
4. టెక్నీషియన్‌ (శాంప్లింగ్): 02
5. లాబొరేటరీ టెక్నీషియన్: 03
6. అసిస్టెంట్ (మెటీరియల్స్): 16
7. అసిస్టెంట్ (అకౌంట్స్): 10
8. స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్): 04
9. హిందీ అసిస్టెంట్‌: 01
10. ఎలక్ట్రిషియన్: 01
11. మెషినిస్ట్: 05
12. డ్రిల్లింగ్ టెక్నీషియన్: 12
13. మెకానిక్: 01
14. మెకానిక్-కమ్-ఆపరేటర్ (డ్రిల్లింగ్): 25
15. జూనియర్ డ్రైవర్: 06

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, బీఎస్సీ, టెన్త్, ఐటీఐ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు దాటరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. రూ.19,600 నుంచి రూ.55,900 జీతం ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫోటో, సైన్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ స్కాన్ చేసి అప్లడో చేయాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జూన్ 14

దరఖాస్తుకు చివరి తేది: 2025 జులై 5

నోటిఫికేషన్‌కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.

అఫీషియల్ వెబ్ సైట్: www.mecl.co.in

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.

ఉద్యోగ ఎంపిక విధానం: స్క్రీనింగ్, రాత పరీక్ష ద్వారా సెలెక్ట్ చేస్తారు. మహరాష్ట్ర, నాగపూర్‌లో నిర్వహిస్తారు.

సర్టిఫికెట్ వెరిఫికేషన్: స్కిల్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల సెలక్షన్ ఉంటుంది. తుది మెరిట్ లిస్ట్ రాత పరీక్ష మార్కుల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.

ALSO READ: TGSRTC Jobs: నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. ఆర్టీసీలో 800 ఉద్యోగాలు, టెన్త్ పాసైతే చాలు

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

వెకెన్సీల సంఖ్య: 108

దరఖాస్తుకు చివరి తేది: 2025 జులై 5

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×