BigTV English

Facial Side Effects: ఫేషియల్‌‌‌తో.. ఈ సమస్యలు రావడం ఖాయం, జాగ్రత్త

Facial Side Effects: ఫేషియల్‌‌‌తో.. ఈ సమస్యలు రావడం ఖాయం, జాగ్రత్త

Facial Side Effects: ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడానికి అమ్మాయిలతో పోటీగా ప్రస్తుతం అబ్బాయిలు కూడా ఫేషియల్స్ చేయించుకుంటున్నారు. ఫేషియల్ చేయించుకోవడం ద్వారా ముఖం లోతుల నుండి శుభ్రం అవుతుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి , రిఫ్రెష్ చేయడానికి మంచి మార్గం. కానీ ఫేషియల్ సరిగ్గా చేయకపోతే.. చర్మానికి హానికరం.


తరచుగా పార్లర్‌లో.. కొన్ని తప్పులు తొందరపడి చేస్తారు. దీని కారణంగా ముఖం మెరుస్తూ ఉండటానికి బదులుగా వాడిపోతుంది. పార్లర్ లలో చేసే సాధారణ తప్పులు అంతే కాకుండా ఫేషియల్ చేయించుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మంపై చికాకు:
ఫేషియల్ చేసేటప్పుడు మీ ముఖం మీద కొంచెం దురద లేదా చికాకు వచ్చినా.. అస్సలు లైట్ తీసుకోకండి. ఎందుకంటే కొన్నిసార్లు రసాయనతో తయారు చేసిన క్రీములు చర్మానికి సరిపోవు. ఇలాంటి పరిస్థితిలో, దురద, చికాకు వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కొన్నిసార్లు ఈ సమస్య చాలా పెరుగుతుంది కూడా. ఫలితంగా మీ ముఖం కూడా దెబ్బతింటుంది. అందుకే.. ఏదైనా క్రీమ్ రియాక్ట్ అవుతుంటే, వెంటనే దాన్ని తొలగించండి.


ముఖం ఎర్రగా మారడం:
ఫేషియల్ చేసేటప్పుడు ముఖం మీద మసాజ్ చేస్తారు. మీ చర్మం సున్నితంగా ఉంటే ఈ మసాజ్ మీ ముఖాన్ని ఎర్రగా చేస్తుంది. కాబట్టి.. ఎల్లప్పుడూ చేతులతో ముఖంపై మసాజ్ చేయండి. ముఖం ఎర్రగా మారుతుంటే.. వెంటనే ఆపండి. లేకుంటే మీ ముఖం పూర్తిగా ఎర్రగా మారుతుంది. కొన్నిసార్లు ఇది వాపుకు కూడా కారణమవుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది.

ఫేషియల్ తర్వాత మొటిమలు:
ఫేషియల్ తర్వాత ముఖం శుభ్రంగా మారుతుంది. కాబట్టి మొటిమలకు అవకాశం కూడా ఉండదు. ఇలాంటి పరిస్థితిలో.. ఫేషియల్ తర్వాత మీ ముఖంపై మొటిమలు కనిపిస్తుంటే..కొన్ని ప్రొడక్ట్స్ మీకు సరిపోవని అర్థం చేసుకోండి. అర్వాత జరిగితే.. డెర్మటాలజిస్ట్ వద్దకు వెళ్లండి.

ఈ విషయాలను గుర్తుంచుకోండి:
ఫేషియల్ ద్వారా మీ ముఖం చెడి పోకూడదనుకుంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు ఈ విషయాలను జాగ్రత్తగా చూసుకోకపోతే మీ ముఖం చెడిపోయే అవకాశం ఉంది.

ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయించుకోండి:
మీరు మొదటిసారి ఫేషియల్ చేయించు కోబోతున్నట్లయితే.. ముందుగా ఫేషియల్ ప్రొడక్ట్స్‌‌‌ ప్యాచ్ టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు కొత్త ఉత్పత్తులు సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తాయి. కాబట్టి ఏదైనా కొత్త ఉత్పత్తిని ఉపయోగించే ముందు..చేయి వెనుక భాగంలో ప్యాచ్ టెస్ట్ చేయించుకోండి. ఇలా చేయడం ద్వారా అలెర్జీ వచ్చే అవకాశం ఉండదు. స్కిన్ సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

Also Read: ఈ హెయిర్ మాస్క్ వాడితే.. సిల్కీ హెయిర్ మీ సొంతం

మీ చర్మ రకాన్ని గుర్తుంచుకోండి:
మీరు ఫేషియల్ చేయించుకోబోతున్నట్లయితే.. ముందుగా మీ చర్మ రకాన్ని చెక్ చేయండి. జిడ్డు, పొడి లేదా సున్నితమైన చర్మానికి తగిన ఫేషియల్‌ను ఎంచుకోండి. ఇలా చేయడం ద్వారా మాత్రమే మీ ముఖం తెల్లగా మెరుస్తూ కనిపిస్తుంది.  అంతే కాకుండా కాంతివంతంగా కనిపిస్తుంది.

Related News

Type 5 Diabetes: టైప్ – 5 డయాబెటిస్ బారిన పడుతున్న యువత .. లక్షణాలు ఎలా ఉంటాయంటే ?

Heart Disease: గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే.. 5 సూపర్ ఫుడ్స్ ఇవే !

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Big Stories

×