BigTV English
Advertisement

Jobs In CISF: 1124 కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా..? సమయం దగ్గర పడుతోంది మిత్రమా…

Jobs In CISF: 1124 కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా..? సమయం దగ్గర పడుతోంది మిత్రమా…

Jobs In CISF: టెన్త్ క్లాస్ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్నఅభ్యర్థులందరూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా కల్పించనున్నారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనం కల్పించనున్నారు.


పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో కానిస్టేబుల్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 4న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆ లోగా ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషణ్ పూర్తి వివరాలను చూద్దాం.

ALSO READ: AAI Recruitment: గోల్డెన్ ఛాన్స్ భయ్యా.. ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు.. ఈ ఉద్యోగం వస్తే జీతం అక్షరాల రూ.1,40,000


మొత్తం ఉద్యోగాల సంఖ్య: 1124

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో కానిస్టేబుల్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కానిస్టేబుల్/డ్రైవర్: 845 ఉద్యోగాలు(ఇందులో యూఆర్-344, ఈడబ్ల్యూఎస్-84, ఎస్సీ-126, ఎస్టీ-63, ఓబీసీ-228 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి)

కానిస్టేబుల్/డ్రైవర్ కమ్ ఆపరేటర్ : 279 ఉద్యోగాలు(యూఆర్-116, ఈడబ్ల్యూఎస్-27, ఎస్సీ-41, ఎస్టీ-20, ఓబీసీ-75 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి)

ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 2025 ఫిబ్రవరి 3

దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 4

విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టెన్త్ పాసై ఉండాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ కూడా చూస్తారు.

వయస్సు: 2025 మార్చి 4 నాటికి 21 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

ఎత్తు 167 సెం.మీ, ఛాతీ 80 నుంచి 85 సెం.మీ ఉండాలి.

జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనం ఉంటుంది. కాబట్టి అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

ఉద్యోగ ఎంపిక విధానం: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.100 ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు మినహాయింపు ఉంటుంది.)

అఫీషియల్ వెబ్ సైట్: https://cisfrectt.cisf.gov.in/

Also Read: CSIR Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. టెన్త్ పాసైతే చాలు.. జీతం రూ.63,200 భయ్యా..

టెన్త్ క్లాస్ పాసై ఉండి శారీరక ప్రమాణాలున్న అభ్యర్థులకు ఇదే మంచి అవకాశం. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఇవ్వనున్నారు. వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ప్రిపరేషన్ షురూ చేయండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ముఖ్యమైనవి:

మొత్తం పోస్టుల సంఖ్య: 1124

ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 2025 ఫిబ్రవరి 3

దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 4

Related News

BRO Notification: టెన్త్ క్లాస్ అర్హతతో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. జీతమైతే అక్షరాల రూ.63,200.. ఇంకెందుకు ఆలస్యం

SBI Notification: డిగ్రీ అర్హతతో స్పెషలిస్ట్ ఉద్యోగాలు.. ఇలాంటి నోటిఫికేషన్ రేర్, జాబ్ వస్తే లైఫ్ అంతా సెట్

RITES Notification: డిగ్రీ, డిప్లొమా అర్హతతో భారీగా జాబ్స్.. ఉద్యోగ ఎంపిక విధానమిదే, ఇంకా వారం రోజులే

ISRO: ఇస్రోలో ఉద్యోగాలు.. రూ.1,77,500 జీతం, టెన్త్, డిగ్రీ పాసైతే చాలు

PNB LBO: నిరుద్యోగులకు పండుగే.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు బ్రో

SEBI JOBS: సెబీలో ఆఫీసర్ ఉద్యోగాలు.. రూ.1,26,100 జీతం, దరఖాస్తు ప్రక్రియ షురూ

BEL Notification: బెల్‌లో భారీగా ఉద్యోగాలు.. బీటెక్ పాసైతే చాలు, జీతం అక్షరాల రూ.1,40,000

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. జిందగీలో ఇలాంటి జాబ్ కొట్టాలి భయ్యా.. లైఫ్ అంతా సెట్

Big Stories

×