CSIR Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. టెన్త్, ఇంటర్ విద్యార్హతలతో పాటు హిందీ, ఇంగ్లిష్ లో టైపింగ్ స్పీడ్ ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. డెహ్రాడూన్ లోని సీఎస్ఐఆర్ కు చెందిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం కింద పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత కలిగిన అభ్యర్థులంతా ఆన్ లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా లభిస్తుంది.
ఉత్తరాఖండ్ రాష్ట్రం, డెహ్రాడూన్ లోని సీఎస్‌ఐఆర్‌కు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం కింద జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జనరల్), జూనియ్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (స్టోర్ అండ్ పర్చెస్), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్) ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఆఫ్ లైన్ లో లేదా ఆన్ లైన్ లో దరఖాస్తుక చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 17
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియంలో పలు రకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జనరల్), జూనియ్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (స్టోర్ అండ్ పర్చెస్), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్) ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
ALSO READ: NTPC Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే ఎనఫ్..
ఉద్యోగాలు వెకెన్సీ వారీగా..
☀జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్)- 05 ఉద్యోగాలు
☀ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (స్టోర్ అండ్ పర్చెస్)- 03 ఉద్యోగాలు
☀జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్)- 05 ఉద్యోగాలు
☀జూనియర్ స్టెనోగ్రాఫర్- 04 ఉద్యోగాలు
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేది: 2025 ఫిబ్రవరి 10
ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేది: 2025 ఫిబ్రవరి 17
విద్యార్హత: టెన్త్, ఇంటర్ పాసై ఉండాలి. అలాగే హిందీ, ఇంగ్లిష్ లో టైపింగ్ స్పీడ్ కలిగి ఉండాలి.
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సు పరిమితిని నిర్దారించారు. దరఖాస్తు చివరి తేది నాటికి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగానికి 28 ఏళ్లు, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి 27 ఏళ్ల వయస్సు మించరాదు.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు రూ.19,900 – రూ.63,200 జీతం ఉంటుంది. జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు రూ.25,500-రూ.81.100 జీతం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పీరక్ష, టైపింగ్ టెస్ట్ షార్ట్ లిస్టింగ్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
ఆఫ్ లైన్ పంపాల్సిన చిరునామా: ఆఫ్ లైన్ దరఖాస్తులు సీనియర్ సీనియర్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, సీఎస్‌ఐఆర్-ఐఐపీ, పీఓ. ఐఐపీ హరిద్వార్ రోడ్, దేహ్రాదూన్ ఉత్తరాఖండ్ చిరునామాకు పంపించాలి.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.iip.res.in/
ALSO READ: APAAR ID Card: ఆధార్ కార్డులా స్టూడెంట్స్‌కు అపార్ కార్డు.. దీంతో ఇన్ని లాభాలా..?
ముఖ్యమైనవి:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 17
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేది: 2025 ఫిబ్రవరి 10
ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేది: 2025 ఫిబ్రవరి 17