నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారికి ఇది గోల్డెన్ ఛాన్స్.. డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, వయస్సు, జీతం, దరఖాస్తు విధానం, తదితర వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1146 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 10న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1146
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ క్యాడర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. 2025 మే 1వ తేదీ నాటికి 20 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2026 జనవరి 2
దరఖాస్తుకు చివరి తేది: 2026 జనవరి 10
ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ కు సంబంధించిన ఎలాంటి సందేహాలు అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు..
అఫీషియల్ వెబ్ సైట్: https://sbi.bank.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది.
ALSO READ: EPFO Pension Hike: ప్రైవేట్ ఉద్యోగులకు రూ.5,000 పెన్షన్.. త్వరలో ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం