Thug Life: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం(Mani Ratnam) దర్శకత్వంలో విశ్వనటుడు కమలహాసన్(Kamal Haasan), శింబు(Simbu), త్రిష(Trisha ) ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం ‘థగ్ లైఫ్’. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ‘జింగుచా’ అంటూ సాగే ఈ పార్టీ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఈ మూవీకి ఏ ఆర్ రెహమాన్(AR Rahman) మ్యూజిక్ అందిస్తూ ఉండగా.. ఈ పాటకి కమల్ హాసన్ స్వయంగా లిరిక్స్ అందించడం విశేషం. జూన్ 5వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి విడుదల కాబోతోంది. మొత్తానికైతే తాజాగా విడుదలైన ఈ ఫస్ట్ లిరికల్ సాంగ్ మాత్రం ఆడియన్స్ ను విపరీతంగా అలరిస్తోంది అని చెప్పవచ్చు. త్రిష , శింబు, కమలహాసన్ చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
ఆకట్టుకుంటున్న లిరికల్ సాంగ్..
ఈ సినిమా నుండి విడుదల చేసిన ‘జింగుచా’ లిరికల్ సాంగ్ ను తమిళ్లో రిలీజ్ చేశారు. “జింగిచా.. జింగే.. జింగే .. జింగిచా.. ఎంగ సుందరివల్లి యా.. ఇన్నుం సుందరం ఆకుంగా.. ఇంద సక్కరకట్టియా.. సేతు పొంగల్ ఆకుంగా.. ఎంగ కంగ కొడుత్తోమ్” అంటూ పెళ్లి వేడుకకు సంబంధించిన ఈ పాటను రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఈ పాట తమిళ్ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందులో పెళ్లి పార్టీకి సంబంధించిన పాట కావడంతో ఆడియన్స్ కూడా భాష అర్థం కాకపోయినా ఇటు మిగతా భాషల వారు కూడా దీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ సినిమాకు భారీగా ప్లస్ అవుతుంది. అటు డాన్స్ స్టెప్స్ కూడా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. రియల్ గా పెళ్లి వాతావరణాన్ని గుర్తు చేస్తోందని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు చాలా అందంగా తీర్చిదిద్దారని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
also read; Alekhya Chitti Pickles : అక్కను పక్కన పెట్టి… రమ్య పికిల్స్.. వీళ్లు మళ్లీ వచ్చేశారు.. ధర తక్కువంటా…
థగ్ లైఫ్ సినిమా వివరాలు..
గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్ , అభిరామి, నాసర్, అలీ ఫజల్ , పంకజ్ త్రిపాఠి, సన్యా మల్హోత్ర , రోహిత్ తో పాటు వైయాపూరి వంటి భారీ తారాగణం ఇందులో భాగమైంది. 1987లో వచ్చిన నాయకన్ చిత్రం తర్వాత ఇన్నేళ్ళకు మళ్ళీ కమల్ హాసన్, మణిరత్నం డైరెక్షన్లో సినిమా రాబోతుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కమల్ హాసన్ 234వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా షూటింగు ఇప్పటికే చెన్నై, కాంచీపురం , పాండిచ్చేరి, న్యూ ఢిల్లీ తో పాటు ఉత్తర భారత దేశంలోని కొన్ని కీలక ప్రాంతాలలో చిత్రీకరించబడింది. ఇక ఈ సినిమాని రాజ్ కమల్ ఫిలిమ్స్, ఇంటర్నేషనల్ మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.