ECIL Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. హైదరాబాద్‌లో అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగాలు, పోస్టులు వాటి వివరాలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, తదితర విధానాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
హైదరాబాద్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో కాంట్రాక్ట్ విధానంలో 125 సీనియర్ ఆర్టిసన్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 7న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 125
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో సీనియర్ ఆర్టిసన్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. వివిధ ట్రేడుల్లో ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఉద్యోగాలు – వెకెన్సీలు వారీగా..
ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 51 పోస్టులు
ఎలక్ట్రీషియన్ : 32 పోస్టులు
ఫిట్టర్: 42 పోస్టులు
విద్యార్హత: ఐటీఐ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తుకు చివరి తేది: 2025 జులై 7
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హతల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గౌరవప్రదమైన జీతం ఉంటుంది. నెలకు రూ.25,368 జీతం ఉంటుంది.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అఫీషియల్ వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.ecil.co.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. నెలకు రూ.25వేలకు పైగా జీతం ఉంటుంది. మరి ఇంకెందకు ఆలస్యం. వెంటనే ఐటీఐ అర్హతలు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ALSO READ: Weather News: రాష్ట్రానికి బిగ్ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 125
దరఖాస్తుకు చివరి తేది: జులై 7