OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీనే ఎక్కువగా ఫాలో అవుతున్నారు మూవీ లవర్స్. ప్రతీ భాషలో వస్తున్న మంచి కంటెంట్ ఉన్న సినిమాలను, ప్రేక్షకులు వదలకుండా చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక మర్డర్ కేసు చుట్టూ తిరుగుతుంది. చివరి వరకూ ఈ సినిమాలో జరిగే ఇన్వెస్టిగేషన్ ఊహించని ట్విస్టులతో మతి పోగొడుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ?అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా పేరు ‘పూణే హైవే’ (Pune highway). 2025లో విడుదలైన ఈ సినిమాకు రాహుల్ ద కున్హా , బగ్స్ భార్గవ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో అమిత్ సాధ్, జిమ్ సర్భ్, అనువాబ్ పాల్, మంజరీ ఫడ్నిస్, కేతకి నారాయణ్, మరియు సుదీప్ మోడక్ వంటి నటులు నటించారు. ఇది 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ప్రదర్శించబడింది. ఇది 2025 మే 23,న థియేటర్లలో విడుదలై, 2025 జూలై 4 నుంచి నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో ఈ సినిమాకి 8.1/10 రేటింగ్ పొందింది.
స్టోరీలోకి వెళితే
ముంబైలోని శాంతిభవన్ అనే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో నివసించే ఐదుగురు బాల్య స్నేహితులు, ఖండూ, విష్ణు , నిక్కీ, నటాషా, బాబు ల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వీళ్ళంతా సరదాగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక రోజు, పూణే హైవేలో జరిగిన ఒక ఘోరమైన ఘటనలో బాబు పక్షవాతానికి గురవుతాడు. అయినా కూడా వీళ్ళ స్నేహం అలాగే కొనసాగుతుంది. అయితే ఒక సంవత్సరం తర్వాత, 200 కిలోమీటర్ల దూరంలో ఒక సరస్సులో, ఒక గుర్తు తెలియని శవం బయటపడుతుంది. ఈ హత్య, ఈ స్నేహితుల జీవితాలను కుదిపేస్తుంది.
ఈ శవం ఎవరిదో తెలిసినప్పుడు, వీళ్ళ స్నేహ బంధాలు విచ్ఛిన్నం అవుతాయి. ఇన్‌స్పెక్టర్ పేఠే ఈ కేసును విచారిస్తూ, అనుమానితుల జాబితాలో విష్ణు మాజీ భార్య నటాషా, వీడియొ లను రికార్డ్ చేసే అలవాటు ఉన్న నిక్కీని చేర్చుతాడు. విచారణలో దిమ్మ తిరిగే విషయాలు బయటికి వస్తాయి. ఆ తరువాత కథ ఒక ఊహించని ట్విస్ట్‌తో ముగుస్తుంది. చివరికి ఆ హత్య చేసింది ఎవరు ? ఎందుకు చేస్తారు ? ఇంతకీ ఆ శవం ఎవరిది ? ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సపెన్స్ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : భార్య ఉండగానే ప్రేయసితో… చిన్న క్లూ కూడా దొరక్కుండా మర్డర్… మెంటలెక్కించే కోర్టు రూమ్ డ్రామా క్లైమాక్స్