DRDO Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డీఆర్‌డీఓ (DRDO), ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA), ఇతర విభాగాలలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 148
సైంటిస్ట్-బి పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ (RAC) ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతోంది.సైన్స్ విభాగాలలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తు కోరుతున్నారు.
పోస్టులు – వివరాలు
డీఆర్‌డీఓలో సైంటిస్ట్-బి- 127 పోస్టులు
ఏబీఏలో సైంటిస్ట్/ఇంజినీర్-బి- 9 పోస్టులు
ఇతర రక్షణ సంస్థలలో ఎన్కాడెడ్ సైంటిస్ట్-బి- 12 పోస్టులు
వివిధ విభాగాల్లో ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్, సైన్స్ & ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెటీరియల్ సైన్స్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజినీరింగ్, ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, గణితం, సివిల్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఎంటమోలజీ, బయోస్టాటిస్టిక్స్, క్లినికల్ సైకాలజీ, సైకాలజీ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సబ్జెక్టులో వ్యాలిడ్ గేట్ స్కోర్‌తో పాటు ఇంజినీరింగ్/ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పాసై ఉండాలి. లాస్ట్ సెమిస్టర్ అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.56,100 జీతం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: గేట్ స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా..
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు. ఇతరులు రూ.100
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
చివరి తేదీ: నోటిఫికేషన్ విడుదలైన 21 రోజుల వరకు ఆన్‌లైన్ లో అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. (జూన్ 10)
నోటిఫికేషన్ ప్రకటన విడుదలైన తేది: 2025 మే 20
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://rac.gov.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి ఆల్ ది బెస్ట్.
Also Read: AVNL Recruitment: ఏవీఎన్‌ఎల్‌లో 1805 జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు, ఈ అర్హత ఉంటే చాలు
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 148
దరఖాస్తుకు చివరి తేది: జూన్ 10