AVNL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. అర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (ఏవీఎన్ఎల్) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అర్హత ఏంటి..? ఎంత వయస్సు ఉండాలి..? ఇలా నోటిఫికేషన్ పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
అర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటిడ్ లో 1805 జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చఏశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1805
అర్మూరుడ్ వెహికల్స్ నిగమ్ లిమిటిడ్ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో జూనియర్ టెక్నీషియన్, జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రీషియన్), జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రోప్లేటర్), జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్ జనరల్), జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్ ఏఎఫ్‌వీ), జూనియర్ టెక్నీషియన్ (పెయింటర్), జూనియర్ టెక్నీషియర్ రిగ్గర్, జూనియర్ టెక్నీషియన్ మెకానిస్ట్ తదితర ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు- వెకెన్సీలు
జూనియర్ టెక్నీషియన్ (బ్లాక్ స్మిత్) : 17 పోస్టులు
జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రీషియన్): 104 పోస్టులు
జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రోప్లేటర్) : 3 పోస్టులు
జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్ జనరల్) : 572 పోస్టులు
జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్ ఏఎఫ్‌వీ) : 41 పోస్టులు
జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్) : 31 పోస్టులు
జూనియర్ టెక్నీషియన్ (హీట్ ట్రీట్‌మెంట్ ఆపరేటర్): 12 పోస్టులు
జూనియర్ టెక్నీషియన్ (మెకానిస్ట్) : 430 పోస్టులు
జూనియర్ టెక్నీషియన్ (ఓఎమ్‌హెచ్ఈ) : 48 పోస్టులు
జూనియర్ టెక్నీషియన్ (పెయింటర్) : 18 పోస్టులు
జూనియర్ టెక్నీషియన్ (రిగ్గర్) : 32 పోస్టులు
జూనియర్ టెక్నీషియన్ (సాండ్ అండ్ షార్ట్ బ్లాస్టర్) : 6 పోస్టులు
విద్యార్హత: సంబంధిత ట్రేడ్ విభాగాల్లో ఎన్ఏసీ/ఎన్‌టీసీ సర్టిఫికేట్ ఉండాలి. (ఎన్ఏసీ- నేషనల్ అప్రెంటీస్ షిప్ సర్టిఫికెట్, ఎన్‌టీసీ- నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్) ఉండాలి.
దరఖాస్తుకు ప్రారంభ తేది: త్వరలో వెల్లడించనున్నారు.
దరఖాస్తుకు చివరి తేది: త్వరలో వెల్లడించనున్నారు.
వయస్సు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
Also Read: BEL Recruitment: బెల్‌లో ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.55,000 జీతం, ఈ అర్హత ఉంటే ఎనఫ్
అఫీషియల్ వెబ్ సైట్: https://avnl.co.in/
నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను అఫీషియల్ వెబ్ సైట్ లో త్వరలో వెల్లడించనున్నారు.