NTPC Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. డిప్లొమాతో పాటు డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ డిగ్రీ లేదా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్/ హాస్పిటల్ మేనేజ్ మెంట్ విభాగాల్లో డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. దేశంలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. మంచి వేతనం కూడా కల్పించనున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
న్యూఢిల్లీ, దేశంలోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ), ఫిక్స్ డ్ టర్మ్ విధానం లో పదిహేను ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోండి. ఏప్రిల్ 25 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగ వెకెన్సీల సంఖ్య: 15
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లో పలు రకాలు ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు- వెకెన్సీలు చూసినట్లయితే..
ఎగ్జిక్యూటివ్ (హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్) : 15 ఉద్యోగాలు
కేటగిరి వారీగా పోస్టుల వివరాలు..
యూఆర్ : 8 పోస్టులు
ఈడబ్ల్యూఎస్ : 1 పోస్టు
ఓబీసీ : 3 పోస్టులు
ఎస్సీ : 2 పోస్టులు
ఎస్టీ : 1 పోస్టు
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 25 (అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 25 లోగా దరఖాస్తు చేసుకోండి.)
విద్యార్హత: డిప్లొమాతో పాటు డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ డిగ్రీ లేదా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్/ హాస్పిటల్ మేనేజ్ మెంట్ విభాగాల్లో డిగ్రీ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
ఉద్యోగ ఎంపిక విధానం: స్క్రీనింగ్, షార్ట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్, ఇంటర్వ్యూ తదితర ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.
వేతనం: సెలెక్ట్ అయిన అభ్యర్థులు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.71 వేల జీతం ఉంటుంది.
వయస్సు: అప్లై చేసుకునే అభ్యర్థులు 45 ఏళ్ల వయస్సు మించరాదు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల వయస్సు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థుల వయస్సు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.300 ఉంటుంది. ఎస్టీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://ntpc.co.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.71 వేల జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
ఉద్యోగ ఖాళీల సంఖ్య: 15
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 25
Also Read: HPCL Recruitment: ఈ అర్హత ఉండే చాలు భయ్యా.. ఈ జాబ్‌కు అప్లై చేసుకోండి.. జీతం మాత్రం రూ.1,20,000