HPCL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్ లేదా ఫైర్ & సేఫ్టీ ఇంజినీరింగ్ విభాగాల్లో 3 ఏళ్ల డిప్లొమా పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అని చెప్పవచ్చు.. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
ముంబయి, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్, రిఫైనరీస్ విభాగంలో వివిధ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 63
హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో మెకానిక్ విభాగంలో జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఎలక్ట్రికల్, ఇన్ స్ట్రుమెంటేషన్, కెమికల్, ఫైర్ అండ్ సేఫ్టీ విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
వెకెన్సీ వారీగా పోస్టులు:
* జూనియర్ ఎగ్జిక్యూటివ్ – మెకానికల్: 11 పోస్టులు
* జూనియర్ ఎగ్జిక్యూటివ్ – ఎలక్ట్రికల్: 17 పోస్టులు
* జూనియర్ ఎగ్జిక్యూటివ్ – ఇన్‌స్ట్రుమెంటేషన్: 6 పోస్టులు
* జూనియర్ ఎగ్జిక్యూటివ్ – కెమికల్: 1 పోస్టు
* జూనియర్ ఎగ్జిక్యూటివ్ – ఫైర్ & సేఫ్టీ: 28 పోస్టులు
విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో అభ్యర్థులు సంబంధిత ఇంజినీరింగ్ (మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్ లేదా ఫైర్ & సేఫ్టీ) విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సు పాసై ఉండాలి.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మార్చి 26
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 30
వయస్సు: దరఖాస్తుకు చివరి తేది నాటికి 25 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు 15 ఏళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), గ్రూప్ డిస్కషన్, టాస్క్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్ నెస్ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
వేతనం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వేతనం రూ.30వేల నుంచి రూ.1,20,000 వేతనం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఆన్ లైన్ లో ఫీజు చెల్లించాలి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ అభ్యర్థులకు రూ.1180 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://hindustanpetroleum.com/
అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకోండి. మంచి వేతనం కల్పిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేష్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 63
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 30
Also Read: GRSE Recruitment: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు.. రూ.లక్షల్లో వేతనాలు భయ్యా..