Karimnagar Murder Case: దేశంలో రోజు రోజుకు భర్తల హత్యలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇదే ట్రెండ్ అయిపోయింది. అలా పెళ్లి చేసుకుంటున్నారు. ఇలా భర్తలను లేపేస్తున్నారు. తాజాగా ఇలాంటిదే మరో సంఘటన చోటుచేసుకుంది.
కరీంనగర్ నగర్ జిల్లాలో కత్తి సురేష్ (36) అనే వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో చెందాడు. ఈ కేసులో మృతుడి భార్య మౌనికతో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. సురేష్, మౌనిక తొమ్మిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదట్లో జీవితం సాఫీగా సాగినా, కొన్నేళ్ల తర్వాత వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. సురేష్ ప్రైవేట్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం, మౌనిక కొద్ది కాలంగా వ్యభిచారిణులుగా.. కొందరితో అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని భర్త సురేష్ గుర్తించడంతో.. కుటుంబంలో తరచుగా గొడవలు జరిగేవి. భర్త వేధింపులు, తిట్లు తట్టుకోలేక చివరికి మౌనిక తన ప్రియుడు శివకృష్ణ (A3) సహకారంతో సురేష్‌ను హత్య చేయాలని నిర్ణయించుకుంది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మౌనికతో పాటు మొత్తం ఆరుగురు ఈ హత్యలో పాల్గొన్నారు. A2 శ్రీజ, A5 సంధ్య మౌనికతో కలిసి వ్యభిచారం వృత్తిలో పనిచేస్తున్నారు. A3 శివకృష్ణ, A4 అజయ్, A6 దేవదాస్ వీరు మౌనికకు స్నేహితులు, హత్యా ప్రణాళికలో కీలకంగా వ్యవహరించారు.
మౌనిక మొదట సురేష్‌ను వయాగ్రా.. మాత్రలు కలిపిన భోజనం తినిపించి చంపాలని ప్రయత్నించింది. కానీ సురేష్ ఆహారంలో ఏదో అనుమానం వచ్చి తినకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది.
మౌనిక మళ్లీ ప్రణాళిక వేసి BP మాత్రలు, నిద్ర మాత్రలు పానీయంలో కలిపింది. వాటిని తాగిన సురేష్ మత్తులోకి వెళ్లడంతో, మౌనిక చీరతో కిటికీ గ్రిల్‌కి ఉరేసి చంపేసింది. ఆ తర్వాత భయపడి, ఇది ఆత్మహత్య అని కుటుంబ సభ్యులకు చెప్పి తప్పుదారి పట్టించింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహం పరిశీలనలో హత్యకు సంబంధించిన గుర్తులు, మౌనిక మొబైల్ ఫోన్‌లోని చాట్ రికార్డులు కీలక ఆధారాలుగా సేకరించారు.
Also Read: ఏపీలో దారుణం.. రన్నింగ్ ట్రైన్ లో మహిళపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్
పోలీసులు మౌనికతో పాటు శ్రీజ, సంధ్య, శివకృష్ణ, అజయ్, దేవదాస్‌లను అరెస్టు చేశారు. వీరి దగ్గర నుండి మొబైల్ ఫోన్లు, BP మాత్రలు, నిద్ర మాత్రలు, వయాగ్రా టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.