Yellamma Movie: జబర్దస్త్ కమెడియన్ బుల్లితెరపై ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు(Venu) సినిమాలపై మక్కువతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా ఈయన దర్శకత్వంలో ప్రియదర్శి(Priyadarshi) హీరోగా నటించిన చిత్రం బలగం(Balagam).. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలను సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకు పెద్ద ఎత్తున కలెక్షన్లు రావడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు సంపాదించుకొని ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.
ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో దిల్ రాజు(Dil Raju) వేణుకి మరో అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలోనే వేణు ఎల్లమ్మ (Yellamma)టైటిల్ తో అద్భుతమైన కథను సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ సినిమా కోసం ఎంతోమంది హీరోలను సంప్రదించినప్పటికీ ఆ హీరోలందరూ పలు కారణాలవల్ల ఈ సినిమా నుంచి తప్పుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా మరింత ఆలస్యం అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం శర్వానంద్, నాని ,నితిన్, వంటి ఎంతోమంది హీరోలు ఈ ప్రాజెక్టుకు కమిట్ అయ్యే తప్పుకున్నారు. ఇకపోతే చివరికి డైరెక్టర్ వేణు ఈ సినిమా కథను ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) కు వినిపించారు.
ఈ సినిమా కథ దేవిశ్రీప్రసాద్ కు బాగా నచ్చడంతో ఈ సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా కోసం దేవి శ్రీ ప్రసాద్ సైన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై చిత్ర బృందం ఎక్కడ అధికారకంగా వెల్లడించలేదు కానీ ఈ సినిమా కోసం దేవిశ్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మాత్రం తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాకు సంగీత దర్శకునిగా కూడా ఆయనే వ్యవహరించబోతున్నారు. ఇక ఈ సినిమాని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఎల్లమ్మ సినిమాకు ఇలా దేవిశ్రీ ప్రసాద్ రూపంలో మోక్షం కలిగిందని తెలుస్తోంది.
ఎల్లమ్మకు హీరో దొరికేసినట్టేనా?
ఎల్లమ్మ సినిమా ద్వారా దేవిశ్రీ హీరోగా వెండి తెరపై కనిపించబోతున్నారనే వార్త తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ విషయం గురించి మేకర్స్ అధికారిక ప్రకటన వెల్లడించాల్సి ఉంది. ఇప్పటివరకు సంగీత దర్శకునిగా తెర వెనుక ఉంటూ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తూ సినిమాని విజయవంతం చేసిన దేవి శ్రీ ప్రసాద్ ఇకనుంచి తెరపై హీరోగా ప్రేక్షకులను సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈయన కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయనకు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే.
Also Read: Nagarjuna 100: నాగార్జున ల్యాండ్ మార్క్ మూవీ.. రంగంలోకి స్వీటీ?