MSVPG: టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మన శంకర వరప్రసాద్ గారు(Mana shanakara Vara prasad garu) అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్గా నయనతార నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా నుంచి విడుదల అయిన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.
ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్న విషయం తెలిసిందే. తాజాగా కూడా మరో వార్త వైరల్ గా మారింది. అయితే ఇందులో చిరంజీవి సరసన నయనతార(nayanatara) శశిరేఖ అనే పాత్రలో నటిస్తోంది. కానీ ఇందులో మరొక హీరోయిన్ కూడా నటిస్తోంది అన్న విషయాన్ని తాజాగా ఒక ఫోటో ద్వారా చెప్పకనే చెప్పేశారు మూవీ మేకర్స్.
ఆ హీరోయిన్ మరెవరో కాదు క్యాథరిన్(Catherine). తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సినిమా సెట్లోకి క్రికెటర్ తిలక్ వర్మ(Thilak Varma) వెళ్లారు. ఈసందర్బంగా మూవీ మేకర్స్ ఆయనను సన్మానించారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫొటోస్ లో హీరోయిన్ క్యాథరిన్ కనిపించడంతో ఆమె కూడా సినిమాలో నటిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తోంది అన్న విషయాన్ని ఈ ఫోటో ద్వారా చెప్పకనే చెప్పేసారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ప్రస్తుతం ఇదే వార్త అలాగే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అవుతున్నాయి.
చిరుసక్సెస్ అవుతాడా..
మరి నిజంగానే ఇందులో క్యాథరిన్ కీలక పాత్రలో నటిస్తోందా, ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాలి అంటే మూవీ మేకర్స్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి. ఇకపోతే మన శంకర వరప్రసాద్ గారు సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చాలా కాలంగా మంచి సక్సెస్ సినిమా కోసం ఎదురుచూస్తున్న చిరుకు ఈ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ను అందిస్తుందని అభిమానులు సైతం భావిస్తున్నారు. మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి..
Also Read: Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డకు ఇష్టమైన హీరో అతనేనా? తెలుగులో ఎవరు లేరా?