NLC Jobs: బీటెక్ పాసై గేట్ స్కోర్ ఉన్న వారికి ఇది సూపర్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఆసక్తి ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి. ఉద్యోగం సాధించండి.
నిరుద్యోగులకు శుభవార్త. తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(NLC) లో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజైంది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 167 ఉద్యోగాలు
ఇందులో పలు విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కంట్రోల్ అండ్ ఇన్ స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ పాసై ఉండాలి. అలాగే గేట్ స్కోర్ కచ్చితంగా ఉండాలి.
వేతనం: ఈ ఉద్యోగానికి మీరు కనుక సెలెక్ట్ అయితే నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు వేతనం ఉంటుంది.
ఉద్యోగానికి సెలెక్ట్ చేసే విధానం: గేట్ స్కోర్, ఇంటర్వ్యూ, షార్ట్ లిస్టింగ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: 2024 జనవరి 15
దరఖాస్తు ఫీజు: రూ.850 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.350 ఉంటుంది)
Also Read: NALCO Jobs: జస్ట్ టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఈ కొలువుకు అప్లై చేసుకోవచ్చు.. APPLY NOW..!
అఫీషియల్ వెబ్ సైట్: https://www.nlcindia.in/new_website/index.htm
సంబంధిత విభాగంలో డిగ్రీ పాసై గేట్ స్కోర్ ఉన్నవారికి ఇది సువర్ణవకాశం. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మంచి వేతనం పొందుతారు. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.