Swiggy Blinkit New Year Party | నూతన సంవత్సర వేడుకలను భారతీయులు ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. క్విక్ కామర్స్ రాకతో ఫన్ పీక్స్‌కు చేరిందనడంలో ఎటువంటి సందేహం లేదు. పార్టీకి, ఎంజాయ్‌మెంట్‌కు కావాల్సినవి అప్పటికప్పుడు ఆర్డర్ పెట్టి తెప్పించుకుని ఈసారి నూతన సంవత్సర వేడుకలను తనవితీరా ఆస్వాదించారు. బ్లింకిట్, స్విగ్గీ, బిగ్‌బాస్కెట్ వంటి అనేక సంస్థలు జనాలు ఆర్డర్ పెట్టిందే తడవుగా నిమిషాల్లో వస్తువులు సరఫరా చేశాయి. ఫన్‌లో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకున్నాయి. ఈ నేపథ్యంలో జనాలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఏమేమీ ఆర్డర్ చేసిందీ పలు సంస్థలు ప్రకటించారు.
న్యూఇయర్ వేడుకల కోసం బ్లింకిట్‌లో ఏమేమీ ఆర్డర్ చేశారనేది సంస్థ సహ వ్యవస్థాపకుడు ఆల్బీందర్ ధిండ్సా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, డిసెంబర్ 31 రాత్రి 8 గంటల వరకూ బ్లింకిట్ ఏకంగా 2.3 లక్షల ప్యాకెట్ల ఆలూ భుజియా డెలివరీ చేసింది.6834 ప్యాకెట్ల ఐస్ క్యూబ్స్ కూడా సరఫరా చేసింది. కండోమ్స్ అమ్మకాల తీరుతెన్నుల గురించి ఓ నెటిజన్ ప్రశ్నింగా అల్బీందర్ సమాధానం ఇచ్చారు. కండోమ్స్‌లో చాక్లెట్ ఫేవర్ వాటా 39 శాతమని తెలిపారు. ఆ తరువాత స్ట్రాబెర్రీ ఫ్లేబర్ కండోమ్స్ (31 శాతం) ఉందని తెలిపారు.
Also Read: న్యూ ఇయర్ పార్టీ కోసం పబ్ వింత ఏర్పాట్లు.. కస్టమర్లకు కండోమ్, ఓఆర్ఎస్ ప్యాకెట్ల కానుకలు..
మరో వైపు, న్యూ ఇయర్ వేడుకల ఆర్డర్ సరళిని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ కూడా వెల్లడించింది. డిసెంబర్ 31 సాయంత్రం 7.30 గంటల సమయంలో గరిష్ఠంగా నిమిషానికి 853 చిప్స్ ప్యాకెట్స్ సరఫరా చేసినట్టు పేర్కొంది. చేతికి బేడీలు, కళ్లకు గంతలు వంటివి పాశ్చాత్య రతి క్రీడ ఐటెమ్స్‌ను కూడా జనాలు సరఫరా చేసినట్టు పేర్కొంది. కొత్త సంవత్సర వేడుకలను నూతనంగా సెలబ్రేట్ చేసుకునేందుకు జనాలు మొగ్గు చూపినట్టు తెలిపారు.
ఇక బిగ్‌బాస్కెట్‌లో నాన్ ఆల్కహాలిక్ బెవరేజ్ సేల్స్ అధికంగా అమ్ముడుపోయినట్టు పేర్కొంది. ఏకంగా 552 శాతం వృద్ధి నమోదైనట్టు వెల్లడించింది. డిస్బోజబుల్ కప్స్, ప్లేట్స్ అమ్మకాల్లో 325 శాతం వృద్ధి నమోదైంది. ఇక సోడా, మాక్‌టెయిల్ అమ్మకాలు 200 శాతం పెరిగాయి. రాత్రి 7.41 సమయంలో గరిష్ఠంగా నిమిషానికి 119 కేజీల ఐస్ క్యూబ్స్ డెలివరీ చేసినట్టు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సహోద్యోగి ఫణి కిషన్ ఏ పేర్కొన్నారు.
ఇక నూతన సంవత్సరంలో కొత్త సంప్రదాయాలు కూడా వేళ్లూనుకుంటున్నాయి. అర్ధరాత్రి 12 ద్రాక్షలు తినడం, ఏదోక కోరిక కోరుకోవడం వంటివి చేస్తున్నారు. కోరిక కోరుకోవడమనే ట్రెండ్‌ను ఓ అమెరికన్ నటి పాప్యులర్ చేసింది. ఇప్పుడిది ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తోంది.
కరోనా సంక్షోభం తరువాత వస్తువల ఇన్‌స్టాంట్ డెలివరీ సేవలు ఊపందుకున్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్ షాపింగ్‌కు సంబంధించి ఇది భారత్‌లో ఓ కొత్త శకానికి నాంది పలికింది. ప్రజల్లో వీటికి మంచి ఆదరణ ఉండటంతో అనేక సంస్థలు ఉనికిలోకి రావడమే కాకుండా క్రమంగా నిలదొక్కుకుని లాభాల బాట పడుతున్నాయి. కొంత కాలం క్రితం వరకూ మెట్రో నగరాలకే పరిమితమైన ఈ సేవలు ప్రస్తుతం టైర్ 2, టైర్ 3 నగరాలకూ విస్తరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వినియోగదారుల అభిరుచుల్లో ఊహించలేని మార్పులకు దారులు పరుస్తున్నాయి.