NALCO Jobs: పదో తరగతి, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు ఇది శుభవార్త అనే చెప్పవచ్చు. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(NALCO) సంస్థ 2025 ఏడాదికి గానూ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
నిరుద్యోగులకు ఇది బంపర్ ఆఫర్. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO) సంస్థ 2025 సంవత్సరానికి సంబంధించి నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉండి అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశమనే చెప్పవచ్చు. ఈ ఉద్యోగానికి మీరు కనుక సెలెక్ట్ అయితే మంచి వేతనం ఉంటుంది.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 518
ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎస్‌యూపీటీ(జేవోటీ)–ల్యాబొరేటరీ–37, ఎస్‌యూపీటీ (జేవోటీ) –ఆపరేటర్–226, ఎస్‌యూపీటీ(జేవోటీ)–ఫిట్టర్–73, ఎస్‌యూపీటీ (జేవోటీ)–ఎలక్ట్రికల్–63, ఎస్‌యూపీటీ (జేవోటీ)–ఇన్‌స్ట్రుమెంటేషన్(ఎం–ఆర్)/ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ (ఎస్–పి)–48, ఎస్‌యూపీటీ(జేవోటీ)–జియాలజిస్ట్–04, ఎస్‌యూపీటీ(జేవోటీ)–హెచ్‌ఈఎంఎం ఆపరేటర్–09, ఎస్‌యూపీటీ (ఎస్‌వోటీ) –మైనింగ్–01, ఎస్‌యూపీటీ (జేవోటీ)–మైనింగ్ మేట్–15, ఎస్‌యూపీటీ (జేవోటీ) –మోటార్ మెకానిక్–22, డ్రస్సర్ కమ్ ఫస్ట్ ఎయిడర్(డబ్ల్యూ2 గ్రేడ్)–05, ల్యాబొరేటరీ టెక్నీషియన్ గ్రేడ్3(పీవో గేడ్)–02, నర్స్ గ్రేడ్3(పీఏ గ్రేడ్)–07, ఫార్మసిస్ట్ గ్రేడ్3(పీఏ గ్రేడ్)–06 ఉ ద్యోగాలు ఇందులో ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి టెన్త్ క్లాస్, ఇంటర్, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్పీ పాసై ఉండాలి.
వయస్సు: ట్రైనీ పోస్టులకు సంబంధించి 27 సంవత్సరాలు కాగా.. ఇతర పోస్టులకు సంబంధించి 34 సంవత్సరాల వయస్సు ఉండాలి.
ఉద్యోగ ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ విధానం: ఆన్ లైన్ విధానంలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
Also Read: Central Warehousing Corporation: డిగ్రీ అర్హతతో జాబ్స్.. భారీ వేతనం.. APPLY NOW..!
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు ఉండదు.)
దరఖాస్తుకు ప్రారంభ తేది వచ్చేసి.. 2024 డిసెంబర్ 31
దరఖాస్తుకు ముగింపు తేది వచ్చేసి.. 2025 జనవరి 21