Arjun Assets : టాలీవుడ్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా గురించి అందరికి తెలుసు.. ఒకప్పుడు యాక్షన్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఈయన నటించిన ప్రతి మూవీ ప్రేక్షకుల మనసు దోచుకుంది. తన సినిమాలతో ఏదొక మెసేజ్ ను ఇస్తాడు. అందుకే ప్రతి మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈయన తెలుగులో కన్నా ముందు కన్నడలో హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు చేశాడు.. ఆ తర్వాత మా పల్లెలో గోపాలుడు అనే మూవీతో తెలుగులో కి ఎంట్రీ ఇచ్చాడు. ఈయన పుట్టి పెరిగింది అంత కన్నడిగుడిగానే అయినా సౌత్ లోని అన్ని భాషల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. కేవలం నటుడిగానే కాదు.వ్యక్తిత్వంలో కూడా ఎంతో ఎత్తున ఉండే మనిషి. ఇటీవల అర్జున్ సర్జా పేరు వార్తలలో హైలెట్ అయ్యింది. అయితే ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు.
అర్జున్ హీరో ఎన్నో సినిమాలను చేసాడు. వరుసగా హిట్ సినిమాలు రావడం తో ఆయన ఆస్తులను బాగానే కూడబెట్టాడు. అర్జున్ మొత్తం ఆస్తుల విలువ రూ. 400 కోట్లకు పైమాటే. అర్జున్ ఇప్పటికి కూడా సినిమాకు రూ. 3 నుండి 4 కోట్లు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బాగానే సంపాదించాడని అంటున్నారు. అర్జున్ కి దాదాపు రూ. 7 కోట్ల విలువ చేసే 5 లగ్జరీ కార్లు ఉన్నాయట. అర్జున్ నివసిస్తున్న ఇంటి ధర రూ. 15 కోట్ల వరకూ ఉంటుందట. అలాగే తన భార్య, పిల్లల పేరు మీద కూడా ఆస్తులు రాసాడు.. మొత్తంగా 400 కోట్ల కు పైగా ఆస్తులు సంపాదించాడు. కానీ ఆయనకు తీరని కోరిక ఒకటి ఉందట. అదేంటో కాదు తన కూతుర్లు సినిమాల్లో బిజీ అవ్వాలని అనుకున్నాడు. పెద్ద కుమార్తే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అందం అభినయం ఉన్నా సక్సెస్ సినిమా లేదు. ఇక ఇటీవలే పెళ్లి చేసుకుంది.. రెండో కూతురు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందని టాక్. కనీసం ఆమె అయిన సక్సెస్ అవుతుందేమో చూడాలి..
ఇక అర్జున్, టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ తో ఒక సినిమాను అనౌన్స్ చేసి ఆపేసారు. దానికి కారణం ఇద్దరి మధ్య ఉన్న ఇగోనే.. విశ్వక్ సేన్ క్రమశిక్షణ లేని నటుడని అర్జున్ ఆరోపించగా.. నేనేమీ సినిమా నుండి తప్పుకోలేదు ఆయనే తీసేశారు, తప్పు చేసి ఉంటే ఆయన కు క్షమాపణలు తెలియజేస్తున్నాను అని విశ్వక్ అన్నారు. తన కూతురు ఐశ్వర్యని హీరోయిన్ గా పెట్టి సినిమా తీయాలనుకుంటే విశ్వక్ సేన్ వలన ఆగిపోయిందని అర్జున్ ఆరోపణలు గుప్పించారు. ఇక ఈయన హీరోగా వందల సినిమాలు చేశాడు. డైరెక్టర్ గా 11 కు పైగా సినిమాలు చేశాడు. నిర్మాత గా కూడా కొన్ని సినిమాలు చేశాడు.. ప్రస్తుతం విలన్ గా సినిమాలు చేస్తున్నాడు.. ఇక ఇటీవల విశ్వక్ సేన్ తో సినిమా ఆగిపోయిన మూవీని త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.