IOCL Apprentice Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు
స్టైఫండ్ కూడా అందజేస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐటీఐ పాసై ఉండాలి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.
NOTE: ఈ రిక్రూట్మెంట్ కు షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే ప్రస్తుతం విడుదలైంది. అఫీషియల్ నోటిఫికేషన్ త్వరలోనే రానుంది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 1770 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 2 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 1770
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
రిఫైనరీస్ డివిజన్ విభాగంలో ఈ అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
అప్రెంటీస్ పోస్టులు: 1770
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మే 3
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 2
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్: 2025 జూన్ 16 నుంచి జూన్ 24 వరకు..
వయస్సు: అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
విద్యార్హత: ఐటీఐ పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు: త్వరలో వెల్లడించనున్నారు.
పూర్తి వివరాల కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://iocl.com/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్థులకు మే 3 నుంచి ప్రారంభమయ్యే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోండి. అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి.
Also Read: AIIMS Mangalagiri: సువర్ణవకాశం.. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు, రూ.లక్షల్లో జీతం..
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం పోస్టుల సంఖ్య: 1770
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మే 3
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 2