Tenth Class Results: తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ ఫలితాల కోసం ఇటు స్టూడెంట్స్, అటు వారి పేరెంట్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే రేపే టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఫలితాలను రేపు విడుదల చేసేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే, ఈసారి పదో తరగతిలో మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. గత సంవత్సరం వరకు పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడింగ్ తో పాటుగా క్యుములేటివ్ గ్రేడింగ్ పాయింట్ యావరేజ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇక నుంచి పదో తరగతి మెమోల్లో సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. జీపీఏ అనేది తీసివేయనున్నట్టు చెప్పారు. మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా రాత పరీక్ష, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడు పొందుపరచనున్నట్టు చెప్పారు. చివరగా విద్యార్థి పాసయ్యారా? ఫెయిల్ అయ్యారా? అనేది క్లారిటీగా ఇవ్వనున్నారు.
తెలంగాణ మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 5,09,403 మంది విద్యార్థులు హాజరయ్యారు.
Also Read: IOCL Recruitment: ఐవోసీఎల్‌లో 1770 పోస్టులు, స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు.. పూర్తి వివరాలివే..