AIIMS Mangalagiri: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మంగళగిరిలో పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి భారీ జీతం ఉంటుంది. అర్హులైన వారు వెంటనే అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మంగళగిరి(AIIMS Mangalagiri ) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మే 25న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
మొత్తం పోస్టుల సంఖ్య: 50
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మంగళగిరిలో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
ప్రొఫెసర్: 07 పోస్టులు
అడిషనల్ ప్రొఫెసర్: 03 పోస్టులు
అసోసియేట్ ప్రొఫెసర్: 08 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్: 32 పోస్టులు
దరఖాస్తు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 26
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 25
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎం, ఎంఫిల్, ఎంఎస్సీ, ఎంసీహెచ్ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.3,100 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.2,100 ఫీజు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
జీతం: ఉద్యోగాన్ని బట్టి రూ.1,01,500 నుంచి రూ.1,68,900 వరకు వేతనం ఉంటుంది. నెలకు ప్రొఫెసర్ ఉద్యోగానికి రూ.1,68,900 జీతం ఉంటుంది. అడిషనల్ ప్రొఫెసర్ ఉద్యోగానికి నెలకు రూ.1,48,200 జీతం ఉంటుంది. అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రూ.1,38,300 జీతం ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి నెలక రూ.1,01,500 జీతం ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.aiimsmangalagiri.edu.in/vacancies/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. ఉద్యోగాన్ని బట్టి రూ.1,01,500 నుంచి రూ.1,68,900 వరకు వేతనం ఉంటుంది. నెలకు ప్రొఫెసర్ ఉద్యోగానికి రూ.1,68,900 జీతం ఉంటుంది. అడిషనల్ ప్రొఫెసర్ ఉద్యోగానికి నెలకు రూ.1,48,200 జీతం ఉంటుంది. అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రూ.1,38,300 జీతం ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి నెలక రూ.1,01,500 జీతం ఉంటుంది.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
ఉద్యోగాల సంఖ్య: 50
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 25
ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా..