BOI Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బీఎస్సీ, బీటెక్, బీఈ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా కల్పించనున్నారు.
ముంబై, బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 23 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 180
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. (ఆఫీసర్ స్కేల్-4 ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.)
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 23
ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మార్చి 23 లోగా ఆన్ లైన లో దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్, బీఈ, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏలో పాసై ఉండాలి.
వయస్సు: 2025 జనవరి 1 నాటికి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకనే అభ్యర్థులు వయస్సు 23 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. నెలకు ఎంఎంజీఎస్-2 ఉద్యోగానికి రూ.64,820 – రూ.93960, ఎంఎంజీఎస్-3 ఉద్యోగానికి రూ.85,920 – రూ.1,05,280, ఎంఎంజీఎస్-4 ఉద్యోగానికి రూ.1,02,300 – రూ.1,20,940 వేతనం ఉంటుంది.
దరఖాస్తు విధానం: అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.850 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.175 ఫీజు ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://bankofindia.co.in
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగం లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. ద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. నెలకు ఎంఎంజీఎస్-2 ఉద్యోగానికి రూ.64,820 – రూ.93960, ఎంఎంజీఎస్-3 ఉద్యోగానికి రూ.85,920 – రూ.1,05,280, ఎంఎంజీఎస్-4 ఉద్యోగానికి రూ.1,02,300 – రూ.1,20,940 వేతనం ఉంటుంది.
ముఖ్యమైన సమాచారం:
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 23
మొత్తం వెకెన్సీ ల సంఖ్య: 180
ALSO READ: NCL Recruitment: సువర్ణవకాశం.. పదో తరగతి అర్హతతో 1765 పోస్టులు, ఇంకా 3 రోజులే గడువు..