BigTV English

CISF Recruitment: టెన్త్ క్లాస్ అర్హతతో 1161 ఉద్యోగాలు.. జీతమైతే నెలకు రూ.69,100.. దరఖాస్తుకు చివరి తేది ఇదే..

CISF Recruitment: టెన్త్ క్లాస్ అర్హతతో 1161 ఉద్యోగాలు.. జీతమైతే నెలకు రూ.69,100.. దరఖాస్తుకు చివరి తేది ఇదే..

CISF Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. టెన్త్ క్లాస్ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా కల్పించనున్నారు.


సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరీటీ ఫోర్స్‌(CISF) వివిధ సెక్టార్లలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్‌ పోస్టుల భర్తీకీ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 3న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.

ALSO READ: ECIL Recruitment: మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.65,000 జీతం.. ఇంకెందుకు ఆలస్యం..


మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1161

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరీటీ ఫోర్స్‌ పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

కానిస్టేబుల్‌/కుక్‌: 493
కానిస్టేబుల్/కాబ్లర్‌: 09
కానిస్టేబుల్‌/టైలర్‌: 23
కానిస్టేబుల్/బార్బర్‌: 199
కానిస్టేబుల్/వాషర్‌మెన్‌: 262
కానిస్టేబుల్/స్వీపర్‌: 152
కానిస్టేబుల్/పెయింటర్‌: 02
కానిస్టేబుల్/ కార్పెంటర్‌: 09
కానిస్టేబుల్/ఎలక్ట్రీషియన్‌: 04
కానిస్టేబుల్/మెయిల్: 04
కానిస్టేబుల్/వెల్డర్‌: 01
కానిస్టేబుల్/చార్జ్‌ మెకానిక్‌: 01
కానిస్టేబుల్‌/ఎంపీ అటెండెంట్‌: 02

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మార్చి 5

దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 ఏప్రిల్ 3

విద్యార్హత: టెన్త్ క్లాస్ లేదా తత్సమాన విద్యార్హతలతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: 2025 ఆగస్టు 1 నాటికి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థుల జీతం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది.

శారీరక ప్రమాణాలు: హైట్ 165 సెంటీ మీటర్లు, ఛాతీ 78-83 సెంటీ మీటర్లు ఉండాలి.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్‌ టెస్ట్‌, రాత పరీక్ష (OMR/ CBT), డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100 ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ నోటిఫికేషన్: https://cisfrectt.cisf.gov.in/

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. మంచి వేతనం కూడా కల్పించునున్నారు. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థుల జీతం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మార్చ 5 నుంచి అప్లికేషన్ ప్రారంభమయ్యే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ముఖ్యమైనవి:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1161 ఉద్యోగాలు

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మార్చి 5

దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 ఏప్రిల్ 3

ALSO READ: Freshers Hiring: గుడ్ న్యూస్.. ఐటీలో లక్షల్లో ఉద్యోగాలు.. వారికి నో టెన్షన్

Related News

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో..

NIACL: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్టార్టింగ్ వేతనమే రూ.50,000.. డోంట్ మిస్

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

Big Stories

×