NCL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. టెన్త్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, బీఈ, ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. ప్రముఖ మినీరత్న కంపెనీ, నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్(NCL)లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టైఫండ్ ఇస్తారు.
నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2025 ద్వారా 1765 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 24 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1765
నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో ఐటీఐ అప్రెంటీస్, డిప్లొమా అప్రెంటీస్ పోస్టులు, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్స్, మైనింగ్, ఫైనాన్స్, అంకౌంటింగ్, సివిల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్ విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
వెకెన్సీ వారీగా పోస్టులు:
ఐటీఐ అప్రెంటీస్: 941 పోస్టులు
డిప్లొమా అప్రెంటీస్: 597 పోస్టులు
గ్రాడ్యుయేట్ అప్రెంటీ: 227 పోస్టులు
విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు టెన్త్ క్లాస్, డిగ్రీ, బీటెక్, బీఈ, ఐటీఐ పాసై ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: 2025 ఫిబ్రవరి 24
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: మార్చి 18
వయస్సు: 2025 మార్చి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 26 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ విధానం: ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి.
ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
స్టైఫండ్: పోస్టులో ఎంపికైన అభ్యర్థులకు స్టైఫండ్ అందిస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగానికి నెలకు రూ.9 వేల జీతం, డిప్లొమా అప్రెంటిస్ పోస్టుకు నెలకు రూ.8000, ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుకు నెలకు రూ.7000 – రూ.8050 వేతనం ఉంటుంది.
నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.nclcil.in/స
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు స్టైఫండ్ కూడా అందజేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే దరఖాస్తు చేసుకోండి. పోస్టుకు సెలెక్ట్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.
ముఖ్య సమాచారం:
మొత్తం పోస్టుల సంఖ్య: 1761
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 18
*దరఖాస్తు చేసుకునేందుకు మరో మూడు రోజుల మాత్రమే గడువు ఉంది.